`జబర్దస్త్` రష్మి ప్రేమ విఫలం.. ప్రియుడు మోసం చేయడంతో గుండె బద్దలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాదగీతం..

Published : Aug 29, 2022, 09:31 PM ISTUpdated : Aug 30, 2022, 05:40 PM IST

`జబర్దస్త్` షోకి బిగ్గెస్ట్ పిల్లర్‌గా ఉంది యాంకర్‌ రష్మి. ఆమె మొన్నటి వరకు సుడిగాలి సుధీర్‌తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఒంటరైపోయింది. అంతేకాదు లేటెస్ట్ గా విషాద గీతంతో కన్నీళ్లు పెట్టిస్తుంది.   

PREV
16
 `జబర్దస్త్` రష్మి ప్రేమ విఫలం.. ప్రియుడు మోసం చేయడంతో గుండె బద్దలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న విషాదగీతం..

`జబర్దస్త్`(Jabardasth) షోలో యాంకర్‌ రష్మి(Anchor Rashmi), సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer) లవర్స్ గా రాణించారు. వీరిద్దరు ఒకరిపై ఒకరు ప్రేమని చాటుకుంటూ నిజమైన లవర్స్ గా కలరింగ్‌ ఇస్తూ వస్తున్నారు. అనేక లవ్‌ సాంగ్స్ కి డాన్సులేస్తూ మరింత రక్తికట్టించారు. అభిమానులకు మాత్రం వీరిద్దరు మంచి ప్రేమికులుగానే నిలిచిపోయాయి. అయితే కొన్ని రోజులుగా రష్మికి దూరమయ్యాడు సుధీర్‌. ఆయన ఇతర షోస్‌, సినిమాలు చేస్తూ బిజీగాఉన్నాడు. 

26

దీంతో `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకు తనే హోస్ట్ గా చేస్తుంది రష్మి(Rashmi Gautam). ఓరకంగా సుధీర్‌ లేకపోవడంతో ఒంటరైపోయింది. అయితే అంతకు ముందే ఓ సందర్భంలో తాను లవ్‌ ఫెయిల్యూర్‌ అంటూ చెప్పింది రష్మి. తనకో ప్రియుడు ఉండేవాడని తెలిపింది. కానీ ఆ స్టోరీని ఎప్పుడూ పెద్దగా ఓపెన్ అయ్యింది లేదు. కానీ ఇప్పుడు ఆమె ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంతగా తపించిపోయిందో కళ్లకి కట్టినట్టు చూపించింది. 

36

తాను ప్రాణంగా ప్రేమించి ప్రియుడు మోసం చేస్తే, పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్‌ ఆఫీస్‌ కి రమ్మని చెప్పి రాకుండా హ్యాండిస్తూ, అతను మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రేమించిన అమ్మాయికి ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆ బాధని రష్మి కళ్లకి కట్టినట్టు స్టేజ్‌పై ఆవిష్కరించింది. తన ప్రియుడు మోసం చేయడంతో కుంగిపోయిన ఆమె ఆ బాధలో విషాద గీతానికి డాన్సు చేస్తూ కన్నీళ్లు పెట్టించింది. 
 

46

`అటు నువ్వే ఇటు నువ్వే.. `అంటూ సాంగే పాటలో రష్మి చేసిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ అందరిని కట్టిపడేసింది. ఆమె ఎక్స్ ప్రెషన్‌, బాధలోనుంచి వచ్చే కన్నీళ్లు షోలోని అందరిచేత కన్నీళ్లు పెట్టించాయి. ఇంద్రజ, వర్ష, కృష్ణభగవాన్‌ ఇలా అందరూ రష్మి హార్ట్ బ్రేకింగ్‌ సాంగ్‌కి కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగినీడు చెప్పిన డైలాగ్‌ మరింత హృదయాలని కలచి వేసింది. బాధలోనుంచే వచ్చే ఎక్స్ ప్రెషన్స్ డెప్త్ వేరే లెవల్‌లో ఉంటాయని చెప్పారు. దీనికి అక్కడున్న వారందరి హృదయాలు బరువెక్కిపోయాయి. 
 

56

రష్మి అంతటి బాధతో ఈ సాంగ్‌ చేయడం విశేషం. నిజంగానే తాను మోస పోయిందా? అనేంతగా తన పర్‌ఫెర్మెన్స్ ని రక్తికట్టించింది. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మి రియల్‌ లైఫ్‌ లవ్‌ ఫెయిల్యూర్‌ కావడం వల్లే ఇలా చేసిందా? అంటున్నారు. సుధీర్ దూరం కావడమే కారణమా? అని పోస్ట్ లు పెడుతున్నారు. 

66

ఇదంతా `మా ఊరి దేవుడు` అనే స్పెషల్‌ ప్రోగ్రామ్‌లోని సన్నివేశాలు. వినాయకచవితి పండుగని పురస్కరించుకుని ఈ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ని ప్లాన్‌ చేశారు. ఇందులో రష్మి చేసిన ఈ విషాద గీతం పర్ఫెర్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ షో పండుగ సందర్భంగా ఈటీవీలో ప్రసారం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories