
ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య పేపర్ చదువుతూ ఉండగా చంద్రమ్మ అక్కడికి వెళుతుంది. అప్పుడు చంద్రమ్మ జ్వాలమ్మ స్కూల్ కి వెళ్తావా అని అనగా వద్దు పిన్ని అని అంటుంది. అలా కాదు జ్వాలమ్మ మాకు ఉన్నంత స్తోమతలో నిన్ను చదివిస్తాము బడికి వెళ్ళు అని అనడంతో వద్దు పిన్ని అవసరం లేదు అని అంటుంది. ఆ తర్వాత సౌర్య హాస్పిటల్ లో డాక్టర్ అమ్మ మీకు తెలుసా అనడంతో తెలుసు కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లోనే పని చేశాను అని అంటుంది చంద్రమ్మ. మరి ఎందుకు మానేశావు అని అనడంతో చంద్రమ్మ టెన్షన్ పడుతూ నువ్వు మళ్ళీ తిట్టకూడదు అనడంతో దొంగతనం చేశారు కదా అనగా అవును అనడంతో చాల్లే పిన్ని నవ్వుతూ చెబుతున్నావు అని తిడుతుంది శౌర్య.
మరి మిమ్మల్ని పోలీసులకు పట్టించలేదా అనగా లేదమ్మా డబ్బులు కావాలంటే నన్ను అడుగు అని డబ్బులు ఇవ్వడానికి వచ్చింది కానీ నేనే వద్దని చెప్పి క్షమించమని అడిగే వచ్చేసాను అని అంటుంది. అప్పుడు సౌర్య నేను ఆ డాక్టర్ తో ఫ్రెండ్షిప్ చేస్తాను మా నాన్న కూడా డాక్టర్ కాబట్టి మేమిద్దరం కలిసి మా నాన్న కోసం వెతుకుతాము అని అంటుంది శౌర్య. అప్పుడు చంద్రమ్మ సరే అని తన మనసులో మీ నాన్న నేను వద్దంటున్నాడు అన్న విషయం చెబితే నువ్వు తట్టుకోగలవా అనుకుని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దీప జరిగిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు దీప ఆ పండగ వెళ్లిపోయిందా వంట చేసిందా చేసే ఉంటుందిలే చారుశీల మంచి అమ్మాయిని పంపించింది అని అనగా వెంటనే దీప నాకు ఏం మాయ రోగం వచ్చింది డాక్టర్ బాబు చెప్పండి అని అంటాడు కార్తీక్.
చెప్పండి డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప. అప్పుడు తగ్గిపోతుంది ఆపరేషన్ జరిగింది కదా టాబ్లెట్స్ వాడుతున్నావు కదా అని అనగా వెంటనే దీప ఎప్పుడు తగ్గిపోతుంది వాళ్ళను పట్టుకోవడానికి కనీసం హాస్పటల్ బయటకి కూడా ఉడక లేకపోయాను అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఏమైంది దీప ఈరోజు నీకు అనడంతో నాకు ఏం కాలేదు డాక్టర్ బాబు నా బెంగ అంతా సౌర్య కోసమే, వాళ్ళు కళ్ళ ఎదురుగా కనిపించినా కూడా పట్టుకోలేకపోయాను కదా అనడంతో ఇప్పుడు తప్పించుకుంటే ఏంటి దీప మరొకసారి కనిపిస్తారు కదా అని అంటాడు కార్తీక్. మనం ఈ ఊర్లో ఉన్నామని తెలిసారు కదా ఈ ఊరు నుంచి కూడా పారిపోతే అనగా వెంటనే కార్తీక్ ఎన్ని ఊర్లని పారిపోతారు ఎన్ని రోజులని తిరుగుతారు దీప అని అంటాడు కార్తీక్.
అప్పుడు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నా కదా డాక్టర్ బాబు వారు ఎందుకు హాస్పటల్ కి వచ్చారు. మన సౌర్యని ఏమైనా తీసుకొని వచ్చారా అని దీప అడగగా కార్తీక్ షాక్ అవుతాడు. కార్తీక్ అబద్దం చెబుతూ వాళ్లకు తెలిసిన వాళ్ళు ఉంటే చూసేకి వచ్చారేమో లే దీప అని అంటాడు. మరొకవైపు సౌందర్య ఆనందరావుకి ఫోన్ చేస్తుంది. అక్కడికి చేరుకున్నావా అని అనగా చాలా సేపు అయింది ఈ చుట్టుపక్కలంతా తిరిగి ఇప్పుడే రూమ్ కి వచ్చాను అని అంటుంది సౌందర్య. అప్పుడు బయట ఎక్కువ తిరగకు సౌందర్య చలి ఎక్కువగా ఉంది నీ ఆరోగ్యం పాడవుతుంది అని ఆనందరావు అనడంతో పాడైన పర్లేదు కొడుకు కోడలు కనిపించాలి అని అంటుంది సౌందర్య.
అందుకే సౌందర్య నేను ఎక్కడికి నేను పంపించను ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు దాని గురించి ఆలోచిస్తూ దాని విడిచిపెట్టకుండా అలాగే ఉంటావు అని అంటాడు ఆనంద్ రావు. మరి వ్యక్తి కదా ఏమైనా ఆచూకీ దొరికిందా అని అనగా ఏమి లేదు అని బాధపడుతుంది సౌందర్య. తర్వాత ఆనందరావు ఎక్కడ ఉన్నారు కార్తీక్ నేను ఏదో గుండెను బరాయి చేసుకొని ఉంటున్నాను కానీ సౌందర్య మీకోసం పిచ్చిదానిలా వెతుకుతుంది అని ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు దీప జరిగిన విషయాలు తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కార్తీక్ నాకు గతం ఎందుకు గుర్తుకు వచ్చింది దీప నిన్ను ఇలా చూడడానికా లేకపోతే నిజం దాచి నిన్ను ఏడిపించడానికి ఏ ముహూర్తం లో నా జీవితంలోకి వచ్చావో అప్పటినుంచి నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్.
అప్పుడు కార్తీక్,దీప దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఏంటి దీప అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా అనగా వాళ్ళు చేతికి దొరికినట్టే దొరికి పారిపోయారు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది దీప. ఇది మొదటిసారి కాదు ఇప్పటికే ఎన్నోసార్లు వాళ్ళు నా చేయి దాటిపోయారు అని బాధపడుతూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్, దీప కి దైర్యం చెబుతూఉంటాడు. ఒకసారి నా గుండె చప్పుడు వినండి డాక్టర్ బాబు నా గుండె నాకోసం కాకుండా సౌర్య ఎక్కడ కొట్టుకుంటూ నన్ను వేధిస్తోంది అని అంటుంది దీప. అప్పుడు దీప, కార్తీక్ భుజం పై తల పెట్టుకుని పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం పండరి దీపను నిద్ర లేపడానికి చూడగానే నిద్రపోతూ ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి చేసుకుంటూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి కూరగాయల ముక్కలు తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పండరి.
అప్పుడు కార్తీక్ నేను ఎక్కువ కాలం ఇలా కష్టపెట్టను దీప తొందరలోనే సౌర్య ని తీసుకుని వచ్చి నీ చేతిలో పెడతాను అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య కార్తీక్ వాళ్ళను వెతకడానికి వెళుతుంది. మరొకవైపు దీప కార్తిక్ కోసం పండరి క్యారెట్ ముక్కలు అవి తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు పండరీ ఏం మాట్లాడకు దీపమ్మ నేను ఏది పెట్టిన మీరు తినాల్సిందే అని అంటుంది. అప్పుడు పండరీ ఎక్కడ నుంచి వెళ్ళిపోయాక దీప నాకు ఏమైంది డాక్టర్ బాబు ఎందుకు పండరి ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనడంతో ఆపరేషన్ అయింది కదా అందుకే పండరి నేను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అని అంటుంది అంటాడు. అప్పుడు కార్తీక్ దీప కు ధైర్యం చెబుతాడు. మరొకవైపు శౌర్య, చారుశీల కోసం హాస్పిటల్ కి వెళుతుంది. అప్పుడు చారుశీల సౌర్యనీ చూసి షాక్ అవుతుంది.