షాక్ :‘అవ‌తార్ -2’కి దారుణమైన రివ్యూలు,రేటింగ్స్ ..నిజంగానే అంత బోరింగా?

Published : Dec 15, 2022, 10:50 AM IST

ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar The Way Of Water). ‘అవతార్‌’ విడుదలైన చాలా ఏళ్ల విరామం తర్వాత వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచానాలున్నాయి.

PREV
111
షాక్ :‘అవ‌తార్ -2’కి దారుణమైన రివ్యూలు,రేటింగ్స్ ..నిజంగానే అంత బోరింగా?


13 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్’ఇప్పటికి అందరికీ గుర్తే.  ప్రముఖ  దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇక ఈ సినిమాకు జనం పట్టం కట్టడంతో, వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా అవతార్-2 మూవీని రిలీజ్‌కు రెడీ చేశాడు జేమ్స్ కామెరాన్.  రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటికే ప్రీమియర్ షోలు పడటంతో రివ్యూలు వచ్చేసాయి. ఆ రివ్యూలలో ఏముంది. చూసేలాగ ఉందా సినిమా ..ఆ విషయాలు చూద్దాం.

211


ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ (Avatar The Way Of Water). ‘అవతార్‌’ విడుదలైన చాలా ఏళ్ల  గ్యాప్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై చాలా అంచానాలున్నాయి. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్ వాటిని పెంచేసింది.  ఇది ప్రేక్షకుల సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. 

311
Image: Google


ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మరోసారి అంచనాలను నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వరల్డ్‌వైడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో మరో ఇరవై నాలుగు గంటల్లో రిలీజ్ అనగా..ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు మొదలయ్యాయి.  

411


ప్రముఖ వెబ్‌సైట్‌ గార్డియన్‌ ఈ సినిమాకు కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. 30 నిమిషాల కార్టూన్‌తో చెప్పే స్టోరీని మూడు గంటలకుపైగా సాగదీసినట్లుగా ఉన్నదని గార్డియన్‌ ఘాటు వ్యాఖ్య చేసింది.

511

ఇక ది టెలిగ్రాఫ్‌ అయితే ఈ మూవీ కేవలం వన్‌ స్టార్‌ రేటింగే ఇచ్చింది. అసలు ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని అనడం విశేషం. అయితే టెక్నికల్‌గా మాత్రం సినిమా బాగుందని చెప్పింది. అటు టైమ్‌ మ్యాగజైన్‌ కూడా ఈ సినిమాకు టూ స్టార్‌ రేటింగ్‌ మాత్రమే ఇచ్చింది. విజువల్స్‌ పరంగా అద్భుతంగా ఉన్నా.. చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏమీ లేదని అనడం గమనార్హం.

611


ఓ ప్రక్కన  ప్ర‌పంచ సినిమా మొత్తం.. రిలీజ్ రోజు ఎప్పుడొస్తుందా? అని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న ఈ టైమ్ లో ఈ రివ్యూలు షాక్ ఇస్తున్నాయి. ఈ సినిమా చాలా బోరింగ్ గా ఉందని అంటున్నారు. బిబిసి వాళ్లు రివ్యూ ఇస్తూ ఈ సినిమా అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది తేల్చారు.
 

711


ఇక ఈ సినిమా సీన్ తర్వాత సీన్ లో జేక్, నెత్రి, వాళ్ల పిల్లలు ఇసుక మీద షికారు చేస్తూ మెరిసే సముద్రంలో ఈత కొడుతూనే ఉంటారు. జేక్ కొడుకుల్లో  ఒకరు ఒంటరి తిమింగలంతో బంధం ఏర్పరుచుకున్నారు. ఆ ఎపిసోడ్ కీలకంగా నడుస్తుంది.  మధ్య మధ్యలో  అవకాసం ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరూ పండోర చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన గంభీరమైన పాఠాలు చెప్తూంటారు. అలాగని పనిలో పనిగా  కొత్త-యుగం హిప్పీ ప్లాటిట్యూడ్‌లను వివరిస్తారు. ఇవి విసుగెత్తించే అంశాలే.

811


అయితే కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నా సినిమా చక్కగా మరియు అందంగా ఉంది. డైరక్టర్ కామెరాన్ టెక్నికల్ నాలెడ్జ్ అబ్బురపరిచే స్దాయిలో ఉంటుంది.  అత్యాధునిక CGI మరియు పెర్ఫామెన్స్ క్యాప్చర్, డిజిటల్ 3D, హైపర్-రియల్ క్లారిటీ మొదలైనవి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.    విజువల్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే విజువల్  యాక్షన్ ఎప్పటికీ వాస్తవంగా అనిపించదు. ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ కార్టూన్ మరియు లైవ్-యాక్షన్ ఫిల్మ్ మధ్య సగం ఉంటుంది. అలాగే ది వే ఆఫ్ వాటర్ అవతార్ కంటే మెరుగ్గా కనిపించడం లేదనేది పెద్ద విమర్శ. 
 

911


అవతార్ 2’ ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమా అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా ఎంతో ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్ర్కీన్ ప్లే, స్పిరిట్యువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్.. అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని గొప్పగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాడు.  అయితే కొందరు మాత్రం సినిమాపై చాలా  నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. సినిమా చాలా బోరింగ్ గా ఉందని...అర్దం పర్దం లేని తిమింగలం కథ నడుస్తూంటుందని అన్నారు. మరికొందరు లెంగ్త్ ఎక్కువైందని, ఫీల్ లేదని అన్నారు.

1011


పండోరా గ్రహాన్ని మించిన అద్భుతాలు ఇందులో ఉంటాయని చిత్ర టీమ్  ముందు నుంచి చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే సముద్రగర్భంలోని సన్నివేశాలు ఉన్నాయని రివ్యూ రైటర్స్  స్పందిస్తున్నారు. ఈ  సినిమాలో చిత్ర హీరోయిన్ , తన కుటుంబంతో గడిపే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో పాటు అనుబంధాలను ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. సామ్‌ వర్తింగ్టన్‌, జోయా సల్డానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా   16న రానుంది.
 

1111


కొందరు  క్రిటిక్స్ మాత్రం దీన్నో మాస్ట‌ర్ పీస్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఇండియాలోసైతం ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల‌లో అడ్వాన్స్ బుకింగులు మొద‌లైపోయాయి. త్రీడీ స్క్రీన్స్ అన్నీ దాదాపుగా ఫుల్ అయ్యాయి. ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్‌లో ఈ సినిమాని చూడాల‌ని హైదరాబాద్ వాసులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ థియేట‌ర్లో టికెట్లు ఎప్పుడో అయిపోయాయి. ఈనెల 16న తెలుగు నాట పెద్ద సినిమాలేం విడుద‌ల కావ‌డం లేదు.   

click me!

Recommended Stories