సునామీ నేపథ్యంలో వచ్చిన బెస్ట్ మూవీస్ లో కమల్ హాసన్ దశావతారం ఒకటి. 2004 ఇండియా, ఇండోనేషియా, శ్రీలంక లాంటి దేశాల్లో సునామీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
ప్రపంచంలోనే 2004లో సంభవించిన సునామీ అత్యంత భయంకర విపత్తుల్లో ఒకటి. ఇండోనేషియా సుమత్రా దీవుల్లో భూకంపం వల్ల భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ఏర్పడింది. దీనితో సముద్ర గర్భంలో ఏర్పడిన డిస్ట్రబెన్స్ వల్ల సునామీ సంభవించింది. ఆ సునామీ ప్రభావం ఇండోనేషియా, థాయిలాండ్, ఇండియా, శీలంక లాంటి దేశాలపై పడింది. ఇండియాలో సునామి ధాటికి 12వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన అన్ని దేశాలలో కలిపితే మొత్తం ప్రాణ నష్టం 2 లక్షలకు పైగా జరిగింది.
25
సునామీ నేపథ్యంలో కమల్ హాసన్ దశావతారం మూవీ
కమల్ హాసన్ నటించిన దశావతారం చిత్రంలో క్లైమాక్స్ లో సునామీ సన్నివేశాలని భయంకరంగా చూపించారు. నిజంగా సునామీ సృష్టించే విధ్వంసం అంత భయంకరంగా ఉంటుందా ? అలలు అంత భారీగా ఎగసిపడతాయా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సునామీ ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అనేది దాని తీవ్రతని బట్టి ఉంటుంది. దశావతారంలో భారీ అలలు దూసుకొస్తునట్లు చూపించారు. నిజానికి అన్ని ప్రాంతాల్లో అలలు అంతే భారీగా ఉండవు.
35
సునామీ విధ్వంసం ఎలా ఉంటుంది ?
2004లో సునామి వచ్చినప్పడు అలలు 3 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు అలలు ఎగసి పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి అలలు మారాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం 15 మీటర్ల వరకు అలలు ఎగసి పడ్డాయి. అలల ఎత్తు మాత్రమే కాదు వాటి వేగం కూడా భయంకరంగా ఉంటుంది. సునామీలో అలల వేగం గంటకు 500 కిమీ నుంచి 800 కిమీ వరకు ఉంటుంది. అంత వేగంతో అలలు వస్తే అవి సృష్టించే విధ్వంసం ఊహకు కూడా అందదు. ఇండోనేషియాలో అయితే కొన్ని ప్రాంతాల్లో అలలు 30 మీటర్ల వరకు కూడా ఎగసిపడ్డాయి.
సునామీ సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం సాధ్యమేనా అంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే సాధ్యమే అని చెప్పొచ్చు. సునామీ వచ్చే ముందు ప్రధానంగా కనిపించే సంకేతం సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళుతుంది. సముద్రపు నీళ్లు అసాధారణంగా వెనక్కి వెళతాయి. టెక్టోనిక్ ప్లేట్స్ లో కదలిక వల్ల సముద్రపు నీళ్లు 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వెనక్కి వెళుతూ ఉంటుంది. సునామీ వస్తుంది అని చెప్పడానికి ఇది బలమైన సంకేతం. ఆ సమయంలో సముద్ర తీర ప్రాంతానికి దూరంగా వెళ్లడం ఉత్తమం.
55
రాకాసి అలలు
కుదిరితే 30 మీటర్ల ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ప్రతి సునామీలో సముద్రం వెనక్కి వెళుతుంది అని చెప్పలేం. ఎలాంటి సంకేతం లేకుండా రాకాసి అలలు ఎగసి పడవచ్చు. 2004లో సునామీ వచ్చినప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళింది. కానీ ఆ సమయంలో సునామీ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు. దీనితో బీచ్ లోనే ఉన్న వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఎత్తైన భవనాల వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు.