Nayanthara: రామ్ చరణ్ కోసం రంగంలోకి నయనతార, లేడీ సూపర్ స్టార్ తో లెక్కల మాస్టారు ఏం ప్లాన్ చేసి ఉంటాడు?

Published : Jul 15, 2026, 01:56 PM IST

Nayanthara: రామ్ చరణ్ నెక్ట్స్ మూవీ కోసం మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సుకుమార్ తో చేయబోయే సినిమాతో చరణ్ సాలిడ్ సక్సెస్ కొడతాడన్న నమ్మకంతోఉన్నారు. ఈక్రమంలో ఈ సినిమా కోసం నయనతారను రంగంలోకి దింపబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

PREV
15
మెగా అభిమానుల ఎదురు చూపులు..

టాలీవుడ్ లో మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా RC17. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్‌సీ17' (RC17) . సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ కు, ఆయన అభిమానులకు సుకుమార్ అయితేనే న్యాయం చేయగలడు అని అందరి నమ్మకం. గతంలో వీరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద బ్లాస్టింగ్ కలెక్షన్స్ ను సాధించింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

25
హీరోయిన్ గా ఎవరు?

ఈ క్రేజీ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతే కాదు ఈసినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు.. ఇంపార్టెట్ క్యారెక్టర్స్ ఎవరితో చేయిస్తారు అనే చర్చ కూడా బాగా నడుస్తోంది. ఈక్రమంలోనే హీరోయిన్ గా ముచ్చటగా మూడోసారి రామ్ చరణ్ సరసన కియారా అద్వాని నటించబోతోంది అని టాక్ గట్టిగా వినిపిస్తుంది. కానీ ఆమెతో కలిసి నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో.. హీరోయిన్ గా కియారాను అందరు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో హీరోయిన్ గా మరికొందరిని సుకుమార్ టీమ్ పరిశీలిస్తోందట.

35
నయనతారను రంగంలోకి దింపిన సుకుమార్?

ఇక ఈసినిమాలో హీరోయిన్ తో పాటు మరో పవర్ ఫుల్ లేడీ రోల్ కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం నయనతారను తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారట. సాధారణంగా సుకుమార్ తన చిత్రాల్లో కేవలం హీరో, హీరోయిన్ల పాత్రలకే కాకుండా కథను మలుపు తిప్పే కీలకమైన సహాయ పాత్రలకు కూడా ఎంతో ఇంపార్టెన్స్  ఇస్తారు. 'రంగస్థలం', 'పుష్ప'లాంటి సినిమాల్లో ప్రతి పాత్ర ఎంతో బలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే 'ఆర్‌సీ17' కోసం ఒక పవర్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌ను సుకుమార్ సిద్ధం చేశారని సమాచారం.

45
పవర్ ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్..

నయనతార చేయబోయే పాత్ర కథకు వెన్నెముకలా నిలుస్తుందని, దీని కోసం లేడీ సూపర్ స్టార్ ను సంప్రదించడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. సౌత్ సినిమాలో తిరుగులేని పాపులారిటీ ఉన్న నయనతార ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, ఈ సినిమాకు పాన్-ఇండియా రేంజ్‌క్రేజ్ తో పాటు మూవీకి తమిళంలో కూడా మంచి పబ్లిసిటీ వస్తుందన్న నమ్మకంతో టీమ్ ఉన్నారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సుకుమార్ రామ్ చరణ్‌కు ఫైనల్ స్క్రిప్ట్‌ను వినిపించగా, చరణ్ కథ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

55
అమెరికాలో సుకుమార్ టీమ్ స్క్రిప్ట్ వర్క్‌

ప్రస్తుతం కథలోని ఎమోషన్స్‌ను మరింత లోతుగా తీర్చిదిద్దేందుకు సుకుమార్ తన టీమ్ కలిసి అమెరికాలో స్క్రిప్ట్ వర్క్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో కానీ.. అక్టోబర్ లో కానీ.. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ దసరాకు ఈమూవీ స్టార్ట్ అవ్వచ్చు. రీసెంట్ గా పెద్ది' చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న రామ్ చరణ్, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతూ చిన్న విరామం తీసుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories