Folk Song: కొన్ని పాటలు ప్రేక్షకుల మనసును ఇట్టే దోచుకుంటాయి. తక్కువ టైంలోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తుంటాయి. అలా యూట్యూబ్ లో 151 మిలియన్ల వ్యూస్ తో దుమ్ము రేపుతోంది ఓ ఫోక్ సాంగ్. బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సాంగ్ ఏంటో చూసేయండి.
జానపద పాటలకు ఉండే ప్రత్యేకతే వేరు. విలేజ్ లైఫ్, ప్రేమాభిమానాలు, బంధాలు బంధుత్వాలు, సంప్రదాయాలను చాలా సింపుల్ పదాలతో మనసుకు హత్తుకునేలా చెప్పడం జానపద గీతాల ప్రత్యేకత. అలాంటి పాటల్లో ఒకటే "నిమ్మతోట వనములో జోడు జంపన గొడుగులో రారా ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి.." అనే ఫోక్ సాంగ్. బావ, మరదలి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ పాట యూట్యూబ్ లో 151 మిలియన్ల వ్యూస్, 470K లైక్స్ తో దుమ్ము రేపుతోంది.
24
అదిరిపోయే డ్యాన్స్ తో..
ఈ ఫోక్ సాంగ్ లో మరదలు, తన బావను ప్రేమగా పిలిచే విధానం, పాటలో వాడిన పదాలు చాలా సింపుల్ గా, అట్రాక్టివ్ గా ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్, మాధురి రాథోడ్ చేసిన డ్యాన్స్.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఏ ఫంక్షన్లో చూసిన ఈ పాట వినిపిస్తోంది. కోట్లాది మంది ఈ పాటను వినడమే కాదు.. ఈ పాటకు స్పెప్పులు వేస్తూ వీడియోలు, షార్ట్స్, రీల్స్ చేయడం వల్ల ఈ పాట క్రేజ్ మరింత పెరిగింది.
34
సాంగ్ లిరిక్స్
మరి యూట్యూబ్ లో అదరగొడుతున్న ఆ సాంగ్ లిరిక్స్ ఓసారి చూసేయండి.