బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `డాకు మహారాజ్`. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రగ్యాజైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ విలన్ గా చేశాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది.
ఈ చిత్రం తెలుగు భాషలోనే విడుదల కానుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో ఇది 21 కోట్లకు(18కోట్లు అని మరో టాక్) అమ్ముడు పోయిందట. ఏపీలో 51కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తుంది.
ఇందులో సీడెడ్‌లో 16కోట్ల, ఆంధ్రాలో 35కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర 8.40కోట్లు, ఈస్ట్ గోదావరి 6.30కోట్లు, వెస్ట్ ఐదు కోట్లు, కృష్ణ 5.60, గుంటూరు 7.20, నెల్లూరు 2.80కోట్ల బిజినెస్ అయ్యిందని టాక్.
ఇలా నైజాం, ఏపీలో కలిసి రూ.73కోట్ల బిజినెస్ జరిగింది. ఇక కర్నాటకలో నాలుగు కోట్లకు, ఇండియా మొత్తంలో 1.50కోట్లకు, ఓవర్సీస్‌లో 8కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తంగా రూ.87కోట్ల (రూ.83కోట్లు అని మరో లెక్క) వ్యాపారం జరిగిందని తెలుస్తుంది.
ఇది బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. గత మూవీ `భగవంత్ కేసరి` రూ.65కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు `డాకు మహారాజ్`కి బిజినెస్ పెరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు రూ.190కోట్ల గ్రాస్ సాధించాలి.