‘గేమ్‌ ఛేంజర్‌’: తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంపు పై దిల్ రాజు కామెంట్

First Published | Jan 7, 2025, 11:35 AM IST

రాంచరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల నిషేధం వంటి కారణాలతో సినిమా విజయంపై సందిగ్ధత నెలకొంది.  

Game Changer, Ramcharan, telangana

2025 సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలలో అత్యంత భారీ సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈమూవీ గురించి మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.  అనుకున్న స్దాయిలో ఈమూవీకి  క్రేజ్ క్రియేట్ కాలేదు.  అందుకు కారణం దర్శకుడు శంకర్ కు  గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్  పడకపోవటం.

మరీ ముఖ్యంగా భారతీయుడు 2 చిత్రం డిజాస్టర్  కావటం. అయితే ఏ సినిమా లెక్క..ఆ సినిమాదే. శంకర్ లాంటి దర్శకుడు ఒక ఫ్లాఫ్ ఇచ్చినంత మాత్రాన వెనకపడిపోడనేది నిజం. ఇక నిర్మాత దిల్ రాజు ఈ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టి ఉన్నారు. దాంతో పెద్ద హిట్ అయ్యితేనే రికవరీ అవుతుంది. అందుకు టిక్కెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు వంటవి కలిసొచ్చే అంశాలు.

GAME CHANGER, CHENNAI EVENT, Ramcharan, shankar

ఇప్పటికే గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి ఒంటి గంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే మొదటి రోజు ఆరు షోలకు అనుమతిచ్చింది.ఆ తర్వాత 11 నుంచి 23వ తేదీ వరకు ఐదు షోలు వేసుకోవచ్చని తెలిపింది.

జనవరి 10 నుంచి జనవరి 23 వరకు 5 షోస్ కు టిక్కెట్ రేట్లు పెంపున కు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 175 రూపాయలు పెంచుకోవచ్చని, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 135 రూపాయలు పెంచుకోవచ్చు. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 


Ram Charans Game Changer film

ఈ నేపధ్యంలో తెలంగాణాలో టిక్కెట్ రేట్లు పెంపు ఉంటుందా ఉండదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాకి కష్టాలు తీసుకొచ్చింది.

ఇటీవల అధిక టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పుష్ప 2'కి ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదురైంది. అలాగే బెనిఫిట్ షోలతో హైదరాబాద్ లో జరిగిన గందరగోళంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'పై భారీ ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. 

Game Changer

ఈ క్రమంలోనే తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటనలు  చేశారు. దీంతో ఇది భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతికి రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్' సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపనుంది.

ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేస్తూ, భారీ ఓపెనింగ్స్ తో లాభాలు రాబట్టాలనుకున్న నిర్మాత ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఆఖరి నిమిషం వరకు దిల్ రాజు ఏదైనా మాయ చేస్తాడా అని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ క్లిష్టతర పరిస్థితులలో బెనిఫిట్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. 

 సినిమా టికెట్‌ ధరల పెంపు అంశంపై త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి చర్చించనున్నట్లు టీఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు తెలిపారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని.. వారి నుంచి ఎలాంటి సమాధానం వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్‌ తమతో చెప్పారని.. అయితే ఇటీవల జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇక సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు.

ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే ఏపీలోని రాజమండ్రిలో నూ మరో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.

పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సముద్రఖని, సునీల్, జయరాం తదితరులు  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. 

read more: తెల్లకల్లు, మటల్‌కే తెలంగాణ ఆడియెన్స్ లో వైబ్‌.. దిల్‌ రాజు నోటి నుంచి అవమానకర వ్యాఖ్యలు

also read: గేమ్ ఛేంజర్ చెన్నై ఈవెంట్ రద్దు? ఏం జరుగుతోంది

Latest Videos

click me!