పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ స్టార్‌లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా, కమిట్ అయిన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `హరిహర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలు చేస్తున్నారు. `ఉస్తాద్ భగత్ సింగ్` కి టైమ్ పట్టే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం `హరిహర వీరమల్లు` సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్. దీన్ని ఈ మార్చిలో ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అనంతరం `ఓజీ` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గ్యాంగ్ స్టర్ ప్రధానంగా రూపొందుతుంది. ఇందులో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ముంబయి బేస్డ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయింది. అందుకే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. `హరిహర వీరమల్లు`కంటే ఈ సినిమా కోసం ఎక్కువగా ఆసక్తితో ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కనిపించబోతున్నట్టు పుకార్లు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
పవన్ ఫ్యాన్స్ , మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విషయాన్ని ఆయన రివీల్ చేశారు. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో పాల్గొన్న ఆయన అకీరా నందన్ సినిమా ఎంట్రీపై స్పందించారు.
read more: ‘గేమ్ ఛేంజర్’: తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు పై దిల్ రాజు కామెంట్
`ఓజీ` సినిమాలో అకీరా కనిపిస్తాడట అని బాలయ్య అడిగిన ప్రశ్నకి విభిన్నంగా స్పందించారు. ఏమో ఓజీలో కనిపించినా ఆశ్చర్యం లేదు అనేలా హింట్ ఇచ్చాడు. `ఓజీ`తో అకీరా ఎంట్రీ ఉండబోతుందనే విషయాన్ని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు.
ఇటీవల ప్రోమోలో ఆ విషయమే చెప్పారు. కానీ పూర్తి ఎపిసోడ్‌లో ఆయన అకీరా గురించి స్పందించినట్టు తెలుస్తుంది. చరణ్ ఎపిసోడ్ రేపు(జనవరి 8న) టెలికాస్ట్ కానుంది.
also read: తెల్లకల్లు, మటల్‌కే తెలంగాణ ఆడియెన్స్ లో వైబ్.. దిల్ రాజు నోటి నుంచి అవమానకర వ్యాఖ్యలు