#Cult Day 1 Collections: కల్ట్ మూవీ మొదటి రోజు వసూళ్లు.. విశ్వక్‌ సేన్‌ సినిమాకి బాక్సాఫీసు షాక్‌

Published : Oct 31, 2026, 09:32 AM IST

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన `#కల్ట్` మూవీ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇండియన్‌ తొలి స్లాషర్‌ మూవీ బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని చూసిందనేది చూస్తే.

PREV
13
విశ్వక్‌ సేన్‌ కల్ట్ మూవీ రిజల్ట్

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ హీరో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం `#కల్ట్`. ఇండియాలో తెరకెక్కిన తొలి స్లాషర్‌ ఫిల్మ్ ఇది. గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, విశాఖ్‌ నాయర్‌, కార్తికేయ, అనేరుధ్‌ భాస్కర్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ మ్యూజిక్‌ అందించారు. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కాకరాల నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే చాలా వరకు బాగా లేదనే అంటున్నారు. అతిహింస చూడటం కష్టమనే కామెంట్‌ వచ్చింది. కానీ విశ్వక్‌ సేన్‌ డైరెక్షన్‌పై ప్రశంసలు దక్కాయి. టెక్నీకల్‌గా బాగానే ఉందనే టాక్‌ వినిపించింది.

23
కల్ట్ మూవీ కలెక్షన్లు

ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కోటి 30లక్షల రూపాయలు రాబట్టింది. ఇది ఇటీవల కాలంలో వచ్చిన విశ్వక్‌ సేన్‌ చిత్రాల్లోకెళ్లా తక్కువ అని చెప్పొచ్చు. దారుణమైన ఓపెనింగ్స్ ని సాధించింది. ఇండియా నెట్‌ రూ.95లక్షలు, ఇండియా గ్రాస్‌ రూ.1.10కోట్లు, ఓవర్సీస్‌లో ఇరవై లక్షలు రాబట్టింది. అయితే మూవీపై పెద్దగా అంచనాలు లేవు. టీమ్‌ కూడా పెద్దగా ప్రమోషన్‌ చేయలేదు. సినిమా ఆడియెన్స్ కి ఎక్కుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఎక్కితే స్లోగా పుంజుకుంటుందనే దాంట్లో టీమ్‌ ఉన్నారు. మరి ఎంత వరకు పుంజుకుంటుందనేది చూడాలి.

33
కల్ట్ మూవీ బడ్జెట్‌, థియేట్రికల్ బిజినెస్‌

మరి సినిమాకి బడ్జెట్‌ ఎంత? థియేట్రికల్‌ బిజినెస్‌ ఎంతా అనేది చూస్తే, మూవీకి రూ.25-30కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం. థియేట్రికల్‌ బిజినెస్ ని రూ.10కోట్లుగా లెక్కకట్టారు. అంటే రూ.11కోట్ల షేర్‌ రాబట్టాలి. ఈ లెక్కన రూ.22కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. మొదటి రోజు ఇది కోటి రూపాయలే రాబట్టింది. ఇంకా రూ.21కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మరి ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories