చిట్టిబాబు పాత్రలో వెంకటేష్..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్ 'చిట్టిబాబు' అనే పాత్రను పోషించారు. ఒక సాధారణ కుటుంబ జీవితం అనూహ్య మలుపు తిరగడం, హౌస్ నెం: 47లో జరిగే పరిణామాలు కథను ముందుకు నడిపిస్తాయి. కుటుంబ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, కామెడీ , యాక్షన్ అంశాలను మిక్స్ చేస్తూ ఈ కథను తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. డింపుల్ హయాతి ఒక ప్రత్యేకమైన పాటలో సందడి చేశారు.