టాలీవుడ్ లో ఫస్ట్ 'ఎ' సర్టిఫికేట్ మూవీ ఏదో తెలుసా..జయలలిత దెబ్బకి ఏఎన్నార్ సినిమాకి షాక్, ఏం జరిగిందంటే

First Published | Oct 12, 2024, 4:30 PM IST

ఇప్పుడంటే బోల్డ్ కంటెంట్ తో చాలా సినిమాలు వస్తున్నాయి. ఆయా చిత్రాల్లో ఉన్న వయలెన్స్, గ్లామర్, రొమాన్స్ ని బట్టి సెన్సార్ సభ్యులు యు, యు/ఎ, ఎ కేటగిరీలుగా విభజించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. గ్లామర్ ఎక్కువైనా, వయెలెన్స్ ఎక్కువైనా కత్తిరించాలని సెన్సార్ సభ్యులు సూచిస్తారు.

ఇప్పుడంటే బోల్డ్ కంటెంట్ తో చాలా సినిమాలు వస్తున్నాయి. ఆయా చిత్రాల్లో ఉన్న వయలెన్స్, గ్లామర్, రొమాన్స్ ని బట్టి సెన్సార్ సభ్యులు యు, యు/ఎ, ఎ కేటగిరీలుగా విభజించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. గ్లామర్ ఎక్కువైనా, వయెలెన్స్ ఎక్కువైనా కత్తిరించాలని సెన్సార్ సభ్యులు సూచిస్తారు. కుదరకుంటే 'ఎ' సర్టిఫికెట్ ఇస్తారు. ప్రస్తుతం ఎ సర్టిఫికెట్ తో సినిమాలు రావడం సాధారణం అయిపోయింది. 

కానీ ఒకప్పుడు అలా కాదు. సినిమాకి ఎ సర్టిఫికెట్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు కాదు. పైగా ఆ చిత్రాలని చిన్నచూపు చూసేవారు. తెలుగులో తొలిసారి ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రం విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగులో తొలిసారి ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రం 'మనుషులు మమతలు'. ఇది అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రం. ఈ చిత్రంలో ఏఎన్నార్ తో పాటు మహానటి సావిత్రి, దివంగత సీఎం జయలలిత, రాజశ్రీ లాంటి నటీమణులు నటించారు. 

Also Read: రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి పెళ్లిళ్లు జరిగింది ఒక్క హీరోయిన్ వల్లే.. షాకింగ్ మ్యాటర్, ఆమె మాత్రం


ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం. 1965లో ఈ చిత్రం విడుదలయింది. ఇంత మంచి ఫ్యామిలీ డ్రామా చిత్రానికి 1965లోనే ఎ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు అనే ఆశ్చర్యం కలగొచ్చు. అప్పట్లో కాస్తో కూస్తో బోల్డ్ గా, గ్లామర్ గా నటించే హీరోయిన్ అంటే జయలలిత మాత్రమే. సావిత్రి, జమున లాంటి హీరోయిన్లు గ్లామర్ రోల్స్ అసలు చేసేవారు కాదు. జయలలిత గ్లామర్ వల్లే ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఒక సన్నివేశంలో ఆమె స్విమ్ సూట్ లో హాట్ హాట్ గా కనిపించారు. 

Also Read : నేను పాడిన పాటకి చిరంజీవి ప్రాణప్రతిష్ఠ..ఎస్పీ బాలు దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే, ఇప్పటి హీరోల్లో

సెన్సార్ సభ్యులు ఈ సన్నివేశాన్ని కట్ చేయాలని సూచించారు. కానీ దర్శక నిర్మాతలు అందుకు అంగీకరించలేదు. దీనితో తప్పని పరిస్థితుల్లో సెన్సార్ వాళ్ళు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తొలిసారి ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రం కావడంతో అందరూ ఈ మూవీ గురించి చాలా రకాలుగా చెప్పుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాతి కాలంలో ఎ సర్టిఫికెట్ అందుకున్న చిత్రాలు చాలా వచ్చాయి. 

ఇక ఎన్టీఆర్ నటించిన చిత్రానికి తొలిసారి ఎ సర్టిఫికెట్ వచ్చింది అగ్గిరవ్వ చిత్రంతోనే.  ఈ మూవీ 1981లో విడుదలైంది. ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ చిత్రంలో మితిమీరిన వయలెన్స్ వల్ల ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. 

Latest Videos

click me!