ప్రభాస్ ని తొక్కేయటానికి జరుగుతున్న కుట్ర...నిజం ఎంత

First Published | Oct 12, 2024, 3:16 PM IST

 అస్త్రంగా ప్రభాస్ ను వాడుకుంటున్నారని, ప్రభాస్ పై నార్త్ ప్రొడ్యూసర్స్  కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొస్తున్నారు. 

Bollywood, Conspiracy, Prabhas


ప్రభాస్ రోజు  రోజుకీ ఎదిగిపోతున్నాడు. తన పరిథిని విస్తరించుకుంటూ  పోతున్నాడు. ఈ క్రమంలో కొన్ని కుట్రలు జరుగుతాయి. అసూయ, ద్వేషంలో కొందరు ఆయన్ని తొక్కేయటానికి ప్రయత్నించవచ్చు అనే టాపిక్ లు బయిట రన్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఎప్పుడైతే బాలీవుడ్ లో బాహుబలి చిత్రంతో జెండా  పాతాడో ఆ రోజు నుంచే బాలీవుడ్ ఆయనపై అసూయ పడుతోందంటూ వార్తలు మొదలు అయ్యాయి. ప్రభాస్ తగ్గేదేలా అన్నట్లు ప్యాన్ ఇండియా మార్కెట్ ని దున్నేస్తున్నాడు. సౌత్ లో యావరేజ్ అనిపించుకున్న సాహో సైతం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇది ఖచ్చితంగా నార్త్ సినిమా ప్రముఖులను బాధించే విషయమే. 

Bollywood, Conspiracy, Prabhas

అలాగే రీసెంట్ గా వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ప్రభాస్ చేసిన  కల్కి చిత్రం అక్కడ కూడా రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. నార్త్ లో మాత్రమే కాకుండా   రజనీకాంత్‌, దళపతి విజయ్‌ల ఆల్‌టైమ్‌ రికార్డులను కల్కి బ్రేక్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 ఇండియన్‌ సినిమాల జాబితాలో కల్కి చేరిపోయింది. రజనీకాంత్‌ హిట్‌ సినిమా  జైలర్‌ లాంగ్‌ రన్‌లో రూ.650 కోట్లు రాబట్టితే.. విజయ్‌ నటించిన లియో మాత్రం రూ. 600 కోట్లు రాబట్టింది. 


Bollywood, Conspiracy, Prabhas


ఇద్దరు సౌత్‌ ఇండియన్‌ టాప్‌ హీరోలకు చెందిన ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ను ప్రభాస్‌ కేవలం ఆరు రోజుల్లోనే దాటేశాడు. బాక్సాఫీస్‌ వద్ద ఇంకా ఈ కలెక్షన్ల జోరు కొనసాగింది.  ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా కల్కి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా 'హనుమాన్‌' రూ.350 కోట్లు, 'ఫైటర్‌' రూ. 327 కోట్లు, 'మంజుమ్మెల్ బాయ్స్  రూ. 242 కోట్లు, 'సైథాన్‌' రూ. 211 కోట్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. దాంతో సౌత్ ఇండస్ట్రీ , సౌత్ హీరోలు అంటే హిందీ భాక్సాఫీస్ దగ్గర మండిపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 

Bollywood, Conspiracy, Prabhas


హిందీ పరిశ్రమ టాలీవుడ్ పై బాలీవుడ్ గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ను తొక్కేయడానికి బాలీవుడ్ కుట్రలు పన్నుతున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు అస్త్రంగా ప్రభాస్ ను వాడుకుంటున్నారని, ప్రభాస్ పై నార్త్ ప్రొడ్యూసర్స్  కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొస్తున్నారు.

ఆ మధ్యన రిలీజ్ అయిన ఆదిపురుష్ మొదలు కుని మొన్నా మద్య వచ్చిన కల్కి  పై ట్రోల్స్ రావడానికి కూడా వారే కారణమని, కావాలనే ఒక ముంబై ఏజెన్సీ మీమర్స్ కు, ట్రోలర్స్ కు డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపణలు వినిపించాయియి. 

Bollywood, Conspiracy, Prabhas


అయితే అదే సమయంలో ఆయనపై ఆదిపురుష్ చిత్రంతో కుట్ర చేసారంటూ వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు కానీ కానీ వైరల్ అయ్యిపోయిందా న్యూస్. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు ఉంచినప్పుడు ఆయన విశ్లేషించి అసలు నిజం చెప్పుకొచ్చారు. ఎందుకంటే వర్మకు బాలీవుడ్ ప్రముఖులతో ఇప్పటికీ మంచి పరిచయాలే ఉన్నాయి. అక్కడ విషయాలు ఎప్పటికప్పుడూ తెలుస్తూంటాయి. ఈ ఆరోపణలపై వివాసాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prabhas aunt about actors wedding plan


రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...“దీనికన్నా పెద్ద జోకు నా జీవితంలో వినలేదు. బాలీవుడ్ అనేది ఒక మీడియా క్రియేటెడ్ లేబుల్.. అయితే అసలు నిజం ఏంటంటే అక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ గా అతడేమి ఆలోచిస్తాడు.. ఒక స్టార్ హీరోను.. అంతకుముందు బాహుబలి సినిమాతో విజయం అందుకున్న ప్రభాస్ ను తీసుకొని ఒక సినిమా తీయాలనుకుంటాడు.

అతడికి మిగాతా ఇండస్ట్రీకి సంబంధం ఉండదు. టాలీవుడ్ లో దిల్ రాజు అనే నిర్మాత ఉన్నాడు.. సుబ్బరాజు అనే మరో నిర్మాత ఉండొచ్చు.. వారిద్దరూ కలిస్తేనే టాలీవుడ్ అవ్వదు కదా.. ఫైనల్ గా ఒక నిర్మాత వాడికెంత డబ్బు వస్తుంది అని చూసుకుంటాడు కానీ, ఎవ్వడినో తొక్కేద్దాం, ఎక్కిద్దాం అనే కాంటెక్స్ట్ అస్సలు వర్క్ అవుట్ అవ్వదు. 


అందుకు ఒక ఉదాహరణ.. బాలసుబ్రమణ్యం గారు మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) సినిమాలో పాట పాడారు. అప్పట్లో ఆయన తెలుగు సింగర్.. అయితే ఆ డైరెక్టర్ ఏం ఆలోచించాడు. ఈయనతో పాట పాటిస్తే మ్యూజిక్ వర్క్ అవుట్ అవుతోంది అని అనుకున్నాడు. ఆ మ్యూజిక్ తో ఆయనకు డబ్బులు వస్తున్నాయి. అందుకే పాడించాడు.

అంతేకానీ బాలసుబ్రమణ్యం గారిని తెలుగు నుంచి హిందీకి తీసుకెళ్లి ఎక్కించేద్దామని కాదు. డబ్బు చేసుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు.. వారందరికీ డబ్బు సంపాదించడమే ఇంట్రెస్ట్. అలాగే ఇప్పుడు ప్రభాస్.. ప్రభాస్ అనే ఒక యాక్టర్ ఎంత మనీ జనరేట్ చేస్తున్నాడు అనేదే వారికి ఇంట్రెస్ట్.. కానీ ఎవడో సౌత్ నుంచి వచ్చి వాడిని తొక్కేస్తున్నాడు అనేది మీడియా ఇన్వెస్ట్ పాయింట్.. నేను దానికి అసలు అంగీకరించడం లేదు.
 

prabhas


ఇక ప్రభాస్ ను తొక్కేయ్యడానికి మీమ్స్, ట్రోలర్స్ కు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్లకేం పని. వాళ్లకేం ఉపయోగం అలా చేయడం వలన.. సరే ఆదిపురుష్ విషయానికొద్దాం.. ప్రభాస్ తప్ప మిగిలినవారందరూ బాలీవుడ్ వాళ్లే.. ఆ డైరెక్టర్ ఏం ఆలోచిస్తాడు. నేను ఇండియాలోకెల్లా పెద్ద డైరెక్టర్ కావాలని ఆశిస్తాడు.

తాను చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకోవాలని చూస్తాడు. ప్రభాస్ ను పెట్టి రాజమౌళి కన్నా పెద్ద హిట్ ను తీద్దామని కోరుకుంటాడు కానీ, నా పేరును త్యాగం చేసి ప్లాప్ తీద్దాం..ఎందుకంటే బాలీవుడ్ ప్రతిష్ట కోసం నా కెరీర్ త్యాగం చేయాలని ఎవడైనా అనుకుంటాడా..? ఇవన్నీ మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ ఏమి లేవు”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Latest Videos

click me!