ఈ సీజన్ కి గాను టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ మూడో స్థానానికి పడిపోయిందట. ఆమె టాప్ సెలబ్రిటీ అయినప్పటికీ... గేమ్ పరంగా మెప్పించడం లేదు. గత రెండు వారాల్లో విష్ణుప్రియ ఆట మరింత దిగజారింది. ఆమె పృథ్విరాజ్ మాయలో పడిపోయింది. సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యాక.. పృథ్విరాజ్ తో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఆమెకు దక్కుతుంది. హోటల్ టాస్క్ లో విష్ణుప్రియ కనీసం ఆకట్టుకోలేదు.
హోస్ట్ నాగార్జున సైతం ఇదే విషయంలో విష్ణుప్రియకు క్లాస్ పీకాడు. నువ్వు ఆటను సీరియస్ గా తీసుకోకపోతే, ప్రేక్షకులు కూడా నిన్ను సీరియస్ గా తీసుకోరని, విష్ణుప్రియకు నాగార్జున నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఐదవ వారం నామినేషన్స్ లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న యష్మి తన ఆటను మార్చుకుంది. హోటల్ టాస్క్ లో 100 శాతం ఇచ్చింది. రాయల్ క్లాన్ సభ్యులు ఆమె సేవలకు మెచ్చి స్టార్ సైతం ఇచ్చారు.