నిర్మాతతో 'కోర్ట్' మూవీ హీరోయిన్ రొమాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన తెలుగు బ్యూటీ

Published : Jul 07, 2025, 07:22 PM IST

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంతో తెలుగు హీరోయిన్ శ్రీదేవి గుర్తింపు పొందింది. కోర్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రీదేవి పేరు మారుమోగింది.

PREV
15

నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రంతో తెలుగు హీరోయిన్ శ్రీదేవి గుర్తింపు పొందింది. కోర్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రీదేవి పేరు మారుమోగింది. ఈ యంగ్ హీరోయిన్ కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అని అంతా అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే శ్రీదేవి తాజాగా తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది.

25

తెలుగు, తమిళ భాషల్లో నిర్మాతగా గుర్తింపు పొందిన కోటపాడి జె రాజేష్(KJR) ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆల్రెడీ రాజేష్ ఒక స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. తాజాగా కేజేఆర్ హీరోగా రెండో చిత్రం చిత్రం కూడా ప్రారంభం అయింది. 

35

సోమవారం ఉదయం చెన్నై లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇటీవల 'మార్క్ ఆంటోనీ' చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ప్రొడక్షన్ నెం. 15 గా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని గంగా ఎంటర్ టైన్మెంట్స్ అందించనుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడైన రెగన్ స్టానిస్లాస్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది.

45

'కోర్ట్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీదేవి ఇందులో హీరోయిన్ గా నటించనున్నారు. శ్రీదేవికి ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. కోర్ట్ మూవీలో టీనేజ్ రొమాన్స్ చూపించిన శ్రీదేవి ఈ చిత్రంలో పూర్తి స్థాయి హీరోయిన్ గా నటించనుంది. 

55

అర్జున్ అశోకన్, సింగం పులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృథ్వీరాజ్, ఇందుమతి, అశ్విని. కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజువర్గీస్, శ్రీకాంత్ మురళి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్, సినిమాటోగ్రఫీ పి. వి. శంకర్ అందిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories