
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం `కూలీ` సినిమాతో రాబోతున్నారు. భారీ కాస్టింగ్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఒక్కో పరిశ్రమ నుంచి ఒక్కో స్టార్ ఉన్నారు. కోలీవుడ్ నుంచి రజనీకాంత్, టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్‌తోపాటు శృతి హాసన్, సత్యరాజ్ వంటి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఇవన్నీ ఓ ఎత్తైతే అత్యంత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందించడం విశేషం.
సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. `మోనికా` అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై దుమ్ములేపింది. మాస్ ఆడియెన్స్ చేత డాన్సులు వేయించింది. సినిమాకి ఒక రేంజ్‌లో క్రేజ్‌ని తీసుకురావడంతోపాటు జనాలకు ఈజీగా రీచ్ అయ్యేలా చేసింది. ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి బజ్ ఉంది. లోకేష్, రజనీ కాంబినేషన్‌లో సినిమా కావడంతో ఆ బజ్ నెలకొందని చెప్పొచ్చు. దీనికితోడు భారీ స్టార్ కాస్ట్, అలాగే అనిరుధ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్‌గా మారాయి.
దీంతో `కూలీ` సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. సుమారు నాలుగు వందల కోట్లకుపైగా బిజినెస్ జరిగిందని సమాచారం. తమిళంలో థియేట్రికల్ హక్కులు వంద కోట్లకు అమ్ముడు పోయాయి. మరోవైపు దిల్ రాజు, సునీల్ నారంగ్, సురేష్ బాబు కలిసి రూ.52కోట్లకు తెలుగు స్టేట్స్ రైట్స్ తీసుకున్నట్టు సమాచారం. ఇంకోవైపు కర్నాటక, కేరళా కలిపి రూ.18కోట్లకు అమ్ముడు పోయిందట. ఓవర్సీస్ రైట్స్ రూ.80కోట్లు పలికాయట. ఇంకోవైపు నార్త్ ఇండియా రైట్స్ రూ.50కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం.
ఇలా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇక ఓటీటీ రూపంలోనూ గట్టిగానే సంపాదించినట్టు సమాచారం. `కూలీ` ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. రూ. 120కోట్లకు ఈ హక్కులను దక్కించుకుందని సమాచారం. దీనికితోడు శాటిలైట్, ఆడియెన్స్ రైట్స్ రూపంలో కూడా బాగానే వచ్చింది. ఇలా మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రిక్ కలుపుకుని రూ.450కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.
`కూలీ` సినిమా బడ్జెట్ రూ.400కోట్లు. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే పెట్టిన బడ్జెట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే లాభాల్లో ఉంది. మరి థియేట్రికల్‌గా వచ్చేదంతా అదనమనే చెప్పాలి. అయితే థియేట్రికల్ బిజినెస్ ప్రకారం రూ.600కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తేనే సినిమా సేఫ్. లేదంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఈ మూవీపై భారీ హైప్ ఉంది. వెయ్యి కోట్లు ఈజీగా రాబడుతుందని భావిస్తున్నారు. మరి ఏ రేంజ్‌లో కలెక్ట్ చేస్తుందో చూడాలి. అయితే ఈ మూవీ విడుదలవుతున్న ఆగస్ట్ 14నే బాలీవుడ్ మూవీ `వార్ 2` కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. దీంతో తెలుగులో, నార్త్ లో ఈ సినిమా ప్రభావం గట్టిగానే ఉంటుంది. దీన్ని హిందీ, తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. `కూలీ` కలెక్షన్లకి `వార్ 2` గట్టి దెబ్బ కొట్టబోతుందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ రెండు సినిమాల మధ్య బిగ్ క్లాష్ ఉండబోతుందని చెప్పొచ్చు.