అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కూలీ దూకుడు
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ "కూలీ" . ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమా మొదటి రోజే గ్రాండ్ బాక్సాఫీస్ కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో అటు తలైవా ఫ్యాన్స్, ఇటు కింగ్ నాగార్జున ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కూలీ సినిమాలో స్టార్ కాస్ట్ ఎక్కువగా ఉండటం. రజినీకాంత్, నాగర్జున ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా 2 సినిమాకు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాని కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సుమారు 80 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సర్కిల్స్ నుంచి సమాచారం. ఇది విడుదలకు ముందే సినిమా పట్ల ఉన్న అంచనాలను హైలైట్ చేస్తోంది.