కూలీ, వార్ 2 చిత్రాలు ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా.. ఏది ముందుగా అంటే..

Published : Aug 14, 2025, 04:34 PM IST

కూలీ, వార్ 2 చిత్రాలు భారీ అంచనాలతో ఆగష్టు 14 గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
భారీ అంచనాలతో వార్ 2, కూలీ రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం నేడు ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రం కూడా విడుదలైంది. రెండు భారీ చిత్రాలు రిలీజ్ కావడంతో బాక్సీవాస్ వార్ తప్పలేదు. అయితే ఊహించని విధంగా రెండు చిత్రాలకు యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. 

25
ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ 

కూలీ, వార్ 2 రెండు చిత్రాలు పూర్తి స్థాయిలో అంచనాలు అందుకోలేదని ప్రేక్షకులను అంటున్నారు. వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలో నటించగా కియారా అద్వానీ కీలక పాత్రలో మెరిసింది. కూలీ చిత్రం స్టార్ కాస్టింగ్ తో నిండిపోయింది. కింగ్ నాగార్జున తొలిసారి విలన్ గా నటించారు. ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. అదే విధంగా శృతి హాసన్ కూడా మెరిసింది. 

35
ఓటీటీ రిలీజ్ 

ఇటీవల థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఆ చిత్రాలు తక్కువ సమయంలోనే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. సినిమా రిజల్ట్ ని బట్టి నిర్మాతలు ఆయా చిత్రాలని ఓటీటీల్లోకి తీసుకువస్తున్నారు. సాధారణంగా థియేటర్ రిలీజ్ కి 8 వారాల గ్యాప్ తర్వాత మాత్రమే ఓటీటీల్లో రిలీజ్ చేయాలి. కానీ థియేటర్స్ లో సినిమా రిజల్ట్ బాగాలేకుంటే వీలైనంత త్వరగా ఓటీటీల్లోకి వచ్చేయడం చూస్తున్నాం. 

45
కూలీ ఏ ఓటీటీలో అంటే.. 

ఇప్పుడు కూలీ, వార్ 2 చిత్రాలు ఎప్పుడు ఓటీటీల్లో రిలీజ్ అవుతాయి అనేది ఆసక్తిగా మారింది. కూలీ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక వార్ 2 ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. కూలీ చిత్రం సెప్టెంబర్ లో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

55
వార్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా 

ఇక వార్ 2 చిత్రాన్ని అక్టోబర్ లో ఓటీటీలోకి తీసుకువస్తారట. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. కూలీ చిత్ర ఓటీటీ హక్కులని ప్రైమ్ వీడియో సంస్థ 120 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వార్ 2 ఓటీటీ ధరకి సంబంధించిన వివరాలు బయటకి రాలేదు. 

Read more Photos on
click me!

Recommended Stories