మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్
ఈ వీడియోలో మంచు లక్ష్మి అర్హాతో మాట్లాడుతూ, "నువ్వు నన్ను ఏదో అడగాలి అన్నావు కదా.. అది ఏంటి?" అని అడిగింది. దీనికి వెంటనే స్పందించిన అర్హ, "మీకు తెలుగు రాదా?" అని ప్రశ్నించింది. దాంతో ఆశ్చర్యపోయిన మంచు లక్ష్మి, "నేను తెలుగు అమ్మాయినే పాప, నీకు అంత అనుమానం ఎలా వచ్చింది? నీతో తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా" అని సమాధానమిచ్చింది.