Bigg Boss 10: బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే బిగ్ బాస్ 10వ సీజన్ తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం నడుస్తోంది. కాగా ఓ కంటెస్టెంట్ రెండో రోజే గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా ఎక్కువమందిని ఆకట్టుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ప్రస్తుతం తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ కొత్త సీజన్ మొదలైంది. తెలుగులో నాగార్జున, తమిళంలోవిజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగులాగే తమిళ్ పదో సీజన్ సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం పందొమ్మిది మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. అయితే ఈ సీజన్ మొదలైన రెండు రోజులు తిరక్కుండానే హౌస్‌లో ఎవరూ ఊహించని ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సాధారణంగా షోలో ఎలిమినేషన్స్ ద్వారా లేదా టాస్క్‌ల సమయంలో గొడవల వల్ల రచ్చ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక కంటెస్టెంట్ ఏకంగా ఇంటిని విడిచి పారిపోవడానికి గోడ ఎక్కి అవతల వైపు దూకేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
23
గోడ ఎక్కిన కంటెస్టెంట్
హౌస్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ కంటెస్టెంట్ పేరు మహమ్మద్ అన్సార్. ‘కుక్ విత్ కోమాలి’ వంటి కార్యక్రమాల ద్వారా అన్సార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ టైమింగ్, మిమిక్రీతో ప్రేక్షకులను అలరించారు. ఆయన ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే షో ప్రారంభమైన రెండో రోజే ఆయన బిగ్‌బాస్ నిర్దేశించిన నిబంధనలు నచ్చకో, లేక అక్కడి వాతావరణం, తోటి పోటీదారుల ప్రవర్తన వల్ల కలిగిన మానసిక ఒత్తిడి తట్టుకోలేకో గానీ హౌస్ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన ద్వారం మూసి ఉండటంతో, తప్పించుకునే మార్గం కనిపించక ఏకంగా హౌస్ ప్రాంగణంలోని ఎత్తయిన గోడను ఎక్కి బయటకు దూకేందుకు ప్రయత్నించారు. తోటి కంటెస్టెంట్లు ఆయనను వారించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు.
33
సోషల్ మీడియాలో వైరల్
అన్సార్ గోడ ఎక్కి తప్పించుకోవాలని చూసిన వీడియోలు బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నెటిజన్లు, బిగ్‌బాస్ అభిమానులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కూడా పలు సీజన్లలో కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లరి చేసిన సందర్భాలు ఉన్నప్పటికీ, షో ప్రారంభమైన 48 గంటల్లోనే గోడ దూకే స్థాయికి పరిస్థితి వెళ్లడం ఇదే మొదటిసారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇది నిజంగానే ఒత్తిడి భరించలేక చేసిన పనా లేక ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి చేసిన పబ్లిసిటీ స్టంటా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.