Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ

Published : Sep 13, 2026, 09:12 AM IST

వెంకటేష్ కెరీర్ బిగినింగ్ నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారట. కొన్ని సినిమాలకు వెంకీ పనికిరాడు అంటూ కొందరు కామెంట్స్ చేసిన విషయాన్ని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

PREV
15
Venkatesh

విక్టరీ వెంకటేష్ రామానాయుడి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చారు. రామానాయుడు కొడుకు అయినప్పటికీ తెలుగు సరిగ్గా రాకపోయినా నేర్చుకుని అన్నీ ఎమోషన్స్ పండించగలిగే నటుడిగా వెంకటేష్ ఎదిగారు. అయితే వెంకటేష్ కెరీర్ లో ప్రతి దశలో ఆయనపై కామెంట్స్ తప్పలేదు. ఈ విషయాన్ని సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సినిమాలకు వెంకటేష్ పనికిరాడు అంటూ కామెంట్స్ చేశారట. అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ కామెడీ చేయలేకపోతున్నాడు అని మరికొందరు కామెంట్స్ చేశారట. కానీ వెంకీ ఇప్పుడు కామెడీకి కింగ్ అయ్యారు. విమర్శలు ఎదురవుతున్నా వెంకీ ఛాలెంజ్ గా తీస్కుని సూపర్ హిట్ కొట్టిన సినిమాల గురించి సురేష్ బాబు తెలిపారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

25
చంటి

సురేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా నాన్నగారికి కూడా నచ్చలేదు. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి వెంకటేష్ కి అసలు సెట్ కాలేదు అని రామానాయుడు అన్నారట. వెంకీ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు అని మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ చంటి ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది.

35
సుందరకాండ

సుందరకాండ సినిమా చేస్తున్నప్పుడు ఏంటిది భాగ్యరాజ్ సినిమాల తరహాలో ఓవర్ సెంటిమెంటల్ గా ఉంది. ఇది వెంకటేష్ కి వర్కౌట్ కాదు అని అన్నారు. అదే సినిమా సంచలన విజయం సాధించింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

45
ప్రేమించుకుందాం రా

ప్రేమించుకుందాం రా సినిమా చేస్తున్నప్పుడు ఈ వయసులో వెంకటేష్ కాలేజ్ స్టూడెంట్ ఏంటి ? లవ్ స్టోరీ చేయడం ఏంటి ? అని కామెంట్స్ చేశారు. కానీ ఆ సినిమా రిజల్ట్ ఏంటో మీ అందరికీ తెలుసు అని సురేష్ బాబు అన్నారు.

55
ఎఫ్ 2

చివరికి ఎఫ్ 2 చేస్తున్నప్పుడు కూడా కామెంట్స్ విన్నాను . వెంకీ ఏంటి ఇలాంటి కామెడీ చేస్తున్నారు అని అన్నారు. కానీ అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా వెంకటేష్ తో చేయించుకున్నారు. ఎఫ్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా అని సురేష్ బాబు పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories