ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి ఇంకా ఆరు రోజులే ఉంది. సెప్టెంబర్ 1న(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందని సమాచారం. ఈ సారి పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఇందులో కమెడియన్లు, టీవీ నటీమణులు ఉన్నారు. కామెడీకి, గ్లామర్‌కి ప్రయారిటీ ఇచ్చారట. ఓ హీరో కూడా రాబోతున్నాడు. వారిలో త్రిగుణ్, రాకింగ్ రాకేష్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, టెంపర్ వంశీ, కృష్ణుడు, జబర్దస్త్ నరేష్ వంటి వారు రాబోతున్నారని సమాచారం. అలాగే చైత్ర రాయ్, జ్యోతి, ముఖేష్ గౌడ వంటి వారు రాబోతున్నారని అంటున్నారు. దీంతో ఈ షోపై ముందు నుంచే ఆసక్తి ఏర్పడింది.