అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి.. అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు. రాజమౌళికి ప్లాప్ రికార్డ్ లేదు. సునిల్ తో సినిమా అనేసరికి చాలామంది వద్దు అని సలహా ఇచ్చారట. ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్ చెడగొట్టుకోవద్దు అని అన్నారట. కాని హిట్ కొట్టి తీరతాను అని చెప్పిన జక్కన్న చేసి చూపించాడు.