ప్రస్తుతం చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒంటరివాడు కాదు, తెలుగు సినిమాపరిశ్రమలో ఆయన మెగా సామ్రాజ్యాన్నే స్థాపించాడు. చిన్న హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి నిర్మాతలు కూడా ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే..మెగా డాటర్ నిహారిక మాత్రమే కనిపిస్తుంటుంది. మెగాఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా చేసింది నిహారిక మాత్రమే. కాని ఆమె కూడా పెద్దగా రాణించలేకపోయింది. యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా.. మల్టీ టాలెంట్ చూపించింది నిహారిక.