బాలయ్య, నాగార్జున పరువు పోయే పరిస్థితి క్రియేట్ చేసిన కమెడియన్ ఎవరు.. రూ.50000 తో అరాచకం

Published : Sep 13, 2025, 02:34 PM IST

Nagarjuna and Balakrishna: ఓ కమెడియన్ దెబ్బకు బాలకృష్ణ, నాగార్జున పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. ఆ కమెడియన్ ఎవరు ? అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
కమెడియన్లు హీరోలుగా..

టాలీవుడ్ లో కమెడియన్లు కూడా హీరోగా రాణించారు. కమెడియన్లుగా కెరీర్ ప్రారంభించి హీరోగా సెటిల్ అయినవారు కూడా ఉన్నారు. కమెడియన్ అలీ మాత్రం కామెడీ పాత్రలు చేస్తూనే హీరోగా కూడా రాణించారు. రెండింటినీ బ్యాలెన్స్ చేయటంలో అలీ బాగా సక్సెస్ అయ్యారు. అప్పట్లో అలీ అగ్ర హీరోలకు సైతం చెమటలు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. అలీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది యమలీల చిత్రం గురించే. 

25
యమలీలతో అలీకి క్రేజ్

అప్పటి వరకు అలీ టాలీవుడ్ లో సాధారణ కమెడియన్ మాత్రమే. యమలీల చిత్రంతో అలీ క్రేజీ సెలబ్రిటీగా మారిపోయారు. 1994లో యమలీల చిత్రం విడుదలైంది. వాస్తవానికి యమలీల చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ స్టార్ హీరోతో చేయాలనుకున్నారు. కానీ ఆ హీరో రిజెక్ట్ చేయడంతో అలీని ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా తీసుకున్నారు. 

35
హలోబ్రదర్, భైరవ ద్వీపం చిత్రాలు పోటీగా యమలీల 

యమలీల మూవీలో కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించారు. ఇంద్రజ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 1994 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ చిత్రానికి కొన్ని రోజుల ముందే నాగార్జున హలో బ్రదర్, బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు అదిరిపోయే టాక్ వచ్చింది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాయి. హలో బ్రదర్ మూవీ అయితే మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో వసూళ్లు రాబడుతోంది. ఇంతటి భారీ చిత్రాల నడుమ అలీ సినిమా రిలీజ్ కావడంతో.. ఇది ఎక్కువ రోజులు థియేటర్స్ లో నిలబడదని ఇండస్ట్రీ వర్గాలు భవించాయి. 

45
ఇద్దరి పరువు పోయేది 

కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి ద్వయం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించారు. హలో బ్రదర్, భైరవద్వీపం చిత్రాలు హిట్ అయ్యాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే అలీ దెబ్బకు నాగార్జున, బాలయ్య పరువు పోయేది. 

55
అలీ రెమ్యునరేషన్ 50 వేలు మాత్రమే 

అప్పటికీ యమలీల చిత్రం బాలయ్య భైరవ ద్వీపం చిత్రాన్ని తొక్కి పడేసింది. భైరవ ద్వీపం చిత్రం 4.5 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కగా 9 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. యమలీల చిత్రం కేవలం 75 లక్షల బడ్జెట్ లో తెరకెక్కి ఏకంగా 10 కోట్ల వసూళ్లు పిండేసింది. నాగార్జున హలో బ్రదర్ చిత్రాన్ని 2.5 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 11 కోట్లు రాబట్టి ఆ ఏది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. యమలీల చిత్రానికి అలీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. కేవలం రూ. 50 వేలు. 

Read more Photos on
click me!

Recommended Stories