MBBS చదివి డాక్టర్ పట్టా అందుకున్న టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Published : Sep 13, 2025, 01:55 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్, నటనతో ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో కొంత మంది డాక్టర్లు ఉన్నారని మీకు తెలుసా? MBBS చదివి, డాక్టర్ పట్టా అందుకుని స్టార్ హీరోయిన్లుగా కొనసాగతున్న వారు ఎవరో తెలుసా?

PREV
15
MBBS చదివి డాక్టర్ పట్టా అందుకున్న హీరోయిన్లు

సినిమా ప్రపంచం ఎప్పుడూ ఆకర్షణీయంగా, గ్లామర్‌తో నిండి ఉంటుంది. కానీ, కొంతమంది ఈ గ్లామర్ ప్రపంచంలోకి రాకముందు గొప్ప గొప్ప చదువులు చదివిన వారు ఉన్నారు. విద్యా రంగంలో అద్భుతాలు చేసిన తారలు ఎంతో మంది ఉన్నారు. అందులో MBBS చదివి డాక్టర్ పట్టా అందుకున్న హీరోయిన్లు కూడా లేకపోలేదు. వైద్యులు కావడానికి అవకాశం ఉన్నప్పటికీ, నటనపై ఉన్న మక్కువతో సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తున్న కొంతమంది టాలెంటెడ్ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం?

25
రీసెంట్ గా MBBS పూర్తి చేసిన శ్రీలీల

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించిన నటి శ్రీలీల, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లో తన మార్క్ నటనతో దూసుకుపోతోంది శ్రీలీల. చాలా తక్కువ టైమ్ లోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది. ఇక ఆమె తల్లి గైనకాలజిస్ట్ కావడంతో, శ్రీలీలకు చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగింది. తన తల్లి ప్రేరణతో ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2021లో పట్టా పొందిన శ్రీలీల, ఆ తర్వాత నటనపై దృష్టి పెట్టింది. వైద్య నేపథ్యం నుండి వచ్చిన ఆమె, ఇతర నటీమణుల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది.

35
డాక్టర్ సాయి పల్లవి

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సాయి పల్లవి. సహజనటిగా గుర్తుంపు సాధించిన సాయి పల్లవి అందరు హీరోయిన్ల కంటే మరింత ప్రత్యేకమైనది. ఆమె నటి కాకముందు జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పట్టా పొందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె నటనా వృత్తిలో చురుగ్గా ఉన్నప్పుడే వైద్య పట్టా పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అరుదైన ఘనత, సాయి పల్లవి నటిగానే కాకుండా వైద్యురాలు కూడా కొనసాగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిన తరువాత హాస్పిటల్ పెట్టి, పేదవారికి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయాలని సాయి పల్లవి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

45
అచ్చ తెలుగు హీరోయిన్

మా ఊరి పొలిమేర, పొలిమేర 2 లాంటి కాన్సెప్ట్ బేస్ సినిమాతో పాటు ఝాన్సీ, సైతాన్, దూత వంటి వెబ్ సిరీస్ లతో అలరించిన హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. స్టార్ డమ్ కోసం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ.. సహజ నటనతో ప్రశంసలు అందుకుంటోంది కామాక్షీ, ఎక్కుగా ఢీగ్లామర్స్ రోల్స్ పోషిస్తున్న కామాక్షి కూడా MBBS చదివింది. చైనాలో MBBS పూర్తి చేసి, అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసిన తర్వాత, నటిగా ఇండస్ట్రీలోకి వచ్చారు కామాక్షి భాస్కర్ల.

55
అదితి శంకర్ కూడా డాక్టరే

సౌత్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ కుమార్తె అదితి శంకర్, తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతోంది. నటనతో పాటు, ఆమె చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పట్టా పొందింది. నటనపై ఉన్న మక్కువతో ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తండ్రిలాగే సినిమా రంగంలో స్టార్ డమ్ ను సాధించాలని కలలు కంటున్న అదితి, తన వైద్య పరిజ్ఞానాన్ని సమాజానికి ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా కొంతమంది డాక్టర్లు ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories