Transfer Trimurthulu Collections: వడ్డే నవీన్‌ సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదు.. ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్‌ కలెక్షన్లు

Published : Jun 23, 2026, 11:48 AM IST

ఒకప్పటి స్టార్‌ హీరో వడ్డే నవీన్‌ చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమాకి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. 

PREV
14
బాక్సాఫీసు వద్ద వడ్డే నవీన్‌ మూవీ స్ట్రగుల్‌

వడ్డే నవీన్‌ దాదాపు పదేళ్ల తర్వాత ఇటీవల `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి కమల్‌ తేజ నార్ల దర్శకత్వం వహించారు. ఇందులో రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించగా, వడ్డే నవీన్‌ ఈ మూవీని నిర్మించడం విశేషం. తన రీఎంట్రీ మూవీకి తనే నిర్మాతగా వ్యవహరించారు. సిన్సియర్‌ కానిస్టేబుల్‌ కథతో ఈ మూవీని రూపొందించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్ టాక్‌ వచ్చింది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.  మా ఇంటి బంగారం, దీవాన సినిమాల ముందు తేలిపోయింది. 

24
ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్ కలెక్షన్లు

`ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` మూవీ మొదటి వీకెండ్‌ పూర్తి చేసుకుంది. అలాగే మొదటి వీక్‌ డే కూడా పూర్తయ్యింది. మరి గడిచిన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి? ఈ మూవీ బడ్జెట్‌ ఎంత? హిట్‌ కావాలంటే ఎంత రావాలి అనేది చూస్తే. ఈ సినిమాకి దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. వడ్డే నవీన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలవబోతుందని చెప్పొచ్చు. కొత్త కుర్రాళ్ల సినిమాల కలెక్షన్లు కూడా బెటర్‌గా ఉన్నాయి, కానీ ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి మాత్రం కనీసం టీ ఖర్చులు కూడా రాలేదని టాక్. 

34
ట్రాన్సఫర్ త్రిమూర్తులు బాక్సాఫీసు వసూళ్లు

ఈ సినిమాని సుమారు రూ.7కోట్లతో నిర్మించాడట వడ్డే నవీన్‌. ఇందులో తనకు రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోలేదు. దాన్ని లెక్క కట్టకుండానే ఏడు కోట్లు అయ్యింది. అయితే ఈ సినిమాకి వస్తోన్న కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఈ మూవీకి నాలుగు రోజుల్లో కనీసం యాభై లక్షలు కూడా రాలేదు. ఈ మూవీకి ఇప్పటి వరకు రూ.25లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఇవి గ్రాస్‌ కలెక్షన్లు. ఇందులో షేర్ తీస్తే సుమారు పదిహేను లక్షలు వస్తుంది. ఇది రిలీజ్‌ అయిన థియేటర్ ఖర్చులు కూడా వసూలు చేయలేకపోయిందని చెప్పొచ్చు. వచ్చిన డబ్బులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకే వెళ్తుంది. ఇక ఈ సినిమా ద్వారా నిర్మాత వడ్డే నవీన్‌కి వచ్చేది జీరో. మొత్తంగా దీని ద్వారా ఆయనకు కనీసం టీ ఖర్చులు కూడా రాలేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇప్పుడు థియేట్రికల్‌గా ఈ మూవీ ఆల్మోస్ట్ క్లోజ్‌ అయ్యిందని సమాచారం. 

44
ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు మూవీ ఎలా ఉందంటే?

ఇక `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` సినిమా విషయానికి వస్తే, హీరో నిజాయితీకి మారుపేరు. దీంతో వరుసగా ట్రాన్సఫర్‌ అవుతుంటాడు. అయితే తాను పని చేసే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభ జరుగుతుంది. దానికి సీఎం వస్తుంది. ఆమె జనాల సింపతీ కోసం ఒక ప్లాన్‌ చేస్తుంది. ద్రౌపతి వస్త్రాభరణం ఘట్టాన్ని మళ్లీ రిపీట్‌ చేయాలని భావిస్తుంది. కానీ ఆ ప్లాన్‌ని త్రిమూర్తులు బ్రేక్‌ చేస్తాడు. దీంతో అతన్ని వేరే స్టేషన్‌కి ట్రాన్సఫర్‌ చేస్తారు. ఏ పనిచెప్పరు, పడాబడ్డ పోలీస్‌ స్టేషన్‌లో ఉండాలని చెప్పగా, అందులో కేసుల ఫైల్స్ వెతుకుతుంటాడు. అందులో ఓ అత్యాచారం కేసుకి సంబంధించిన ఫైల్‌ బయటపడుతుంది. ఆ కేసుకి త్రిమూర్తులు తండ్రి మరణానికి సంబంధం ఉంటుంది? ఆ సంబంధం ఏంటి? ఆ కేసుకి సీఎం కొడుక్కి ఉన్న సంబంధమేంటి? దాన్ని త్రిమూర్తులు ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. ఇది ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. రొటీన్‌గా ఉంది, స్లోగా సాగుతుంది. లాజిక్‌ లెస్‌గానూ ఉంది. వడ్డే నవీన్‌ కూడా ఏమాత్రం ఈజ్‌తో నటించలేకపోయాడు. ఇవన్నీ మూవీకి మైనస్‌గా చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories