బౌల్‌లో వేడిపాలను పిల్లి తాగితే ఏమవుతుంది?.. సితార ఇచ్చిన ఝలక్ కి మహేష్‌ ఫ్యూజులు ఔట్‌!

మహేష్‌ బాబు కూతురు సితార మామూలు యాక్టివ్‌ కాదు. తండ్రిని మించిన తనయ అని చెప్పొచ్చు. ఓ షోలో ఆమె ఏకంగా మహేష్‌కే ఝలక్‌ ఇవ్వడం విశేషం. 
 

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబుకి కూతురు సితార అంటే ఎంతో ఇష్టం. ఆమె క్యూట్‌ లుక్‌కి మహేష్‌ ముచ్చటపడుతుంటాడు. అంతేకాదు ఆమె తెలివికి సంబరపడుతుంటారు. చాలా సందర్భాల్లో సితార గురించి చెప్పాడు మహేష్‌.. సితార పాపతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, దూల తీర్చేస్తాదని, చాలా టఫ్‌ అని వెల్లడించాడు. సితారని తట్టుకోవడం చాలా కష్టమని కూతురు గురించి చాలా గొప్పగా చెప్పారు మహేష్‌. 
 

Sitara Ghattamaneni

తన గురించి అంత గొప్పగా చెప్పిన మహేష్‌కే ఝలక్‌ ఇచ్చింది సితార. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనకు సితార ఓ ఫజిల్‌ పెట్టింది. చిన్నపాటి పొడుపు కథలా మహేష్‌ బాబుని టెస్ట్ పెట్టింది. అందరి ముందు షోలో డాడీని ప్రశ్న అడగ్గా దానికి మహేష్‌ సమాధానం చెప్పలేకపోయాడు. కానీ ఆమె చెప్పింది. ఆ సమాధానం విని సూపర్‌ స్టార్‌కి ఫ్యూజులు ఎగిపోయాయి. మరి ఇంతకి ఆ ప్రశ్నేంటి? అనేది చూస్తే..
 


మహేష్‌బాబు, కూతురు సితారతో కలిసి చాలా రోజుల క్రితం జీ తెలుగుకి సంబంధించిన ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో తండ్రి మహేష్‌ని సితార ప్రశ్నిస్తూ, పిల్లి బౌల్‌లో ఉన్న వేడి వేడి పాలను తాగితే ఏమవుతుంది? అని క్వచ్చన్‌ వేసింది. దీనికి కాసేపు ఆలోచించిన మహేష్‌ `ఏమవుతుంది.. మూతి కాలిపోతుందమ్మా` అన్నాడు. దీనికి సితార చెబుతూ, కాదు బౌల్‌ ఖాళీ అయిపోతుంది అని చెప్పి షాకిచ్చింది.
 

అంతే దెబ్బకి మహేష్‌ బాబుకి మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయ్యింది. దీంతో ఓరినీ వేషాలో అన్నట్టుగా మహేష్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. చాలా ఫన్నీగా ఉన్న ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 
 

సితార ఇంకా స్కూలింగ్‌లోనే ఉంది. 13ఏళ్ల సితార ప్రస్తుతం ఏడో క్లాస్‌ చదువుతుంది. కానీ అప్పుడే స్టార్‌ అయిపోయింది. స్టార్‌ కిడ్‌గా రాణిస్తుంది. ఆమె ఆ మధ్య చేసిన నగల యాడ్‌ ఏకంగా అమెరికాలో ప్రదర్శించడం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్‌గా సితార రికార్డు సృష్టించింది. అంతేకాదు దీనికిగానూ భారీగానే పారితోషికం అందుకుంది. ఆ మొత్తంలో చాలా వరకు ఛారిటీ కోసం ఉపయోగించింది సితార. 
 

Mahesh Babu

ప్రస్తుతం మహేష్‌ బాబు.. రాజమౌళితో చేయబోతున్న సినిమా కోసం ప్రిపేర్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ప్రపంచసాహసికుడిగా మహేష్‌ బాబు కనిపిస్తాడట. అందుకోసం తన లుక్‌ మార్చేస్తున్నాడు మహేష్‌. జుట్టు పెంచుతూ కొత్తగా కనిపిస్తున్నాడు. హాలీవుడ్‌ హీరోలను తలపిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 
 

Latest Videos

click me!