ఒక ఎంప్లాయ్ గా నేను లిమిట్ లో ఉంటాను, బాస్ గా లిమిట్స్ లో ఉండు నువ్వు ఉండు లేదు అంటే పరిణామాలు చాలా వేరేగా ఉంటాయి అని అభిమన్యు కీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చిత్ర. అందంగా ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ ఈ చిత్రాకి అందం, పొగరు రెండు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాడు అభిమన్యు. మరోవైపు యష్ సంతోషంగా ఇంటికి వెళ్లి వేద కోసం చూస్తూ ఉంటాడు. ఈ మిసెస్ న్యూసెన్స్ ఎక్కడికో వెళ్ళింది అయినా పార్టీకి నన్ను రమ్మని పిలుస్తుంది.