ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి,అమ్మ విన్నీ అంకుల్ బాగా నవ్విస్తున్నాడు అనడంతో దట్ ఇస్ మై ఫ్రెండ్ విన్నీ అంటుంది వేద. అప్పుడు అందరూ నవ్వుకుంటూ ఉండగా ఇంతలోనే విన్నీ ఒక్కసారిగా సీరియస్ అయ్యి నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చానో తెలుసా అని సీరియస్ గా మాట్లాడుతూ మా వేదు చేసే కాఫీ కోసం అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. యష్ మాత్రం లోలోపల కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది గమనించిన వేద కావాలని విన్నితో క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తుంది. అప్పుడు ఖుషి, యష్ దగ్గరికి వెళ్లి నేను అమ్మ అనుకున్న లాగే అంకుల్ మమ్మీ ఇద్దరు అనుకుంటారు అనడంతో అప్పుడు వేద, విన్నీ ఇద్దరూ ఇద్దరం ఫ్రెండ్స్ అని సరదాగా అనుకోవడంతో అది చూసి యష్ మరింత కుళ్ళుకుంటూ ఉంటాడు.