తెరవెనుక గర్జించే సింగం ఇక లేరు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి హఠాన్మరణం.. హీరో సూర్యకి బిగ్ లాస్

First Published Jan 27, 2023, 11:51 AM IST

చిత్ర పరిశ్రమకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అలనాటి నాటి జమున మరణంతో మరణంతో ఇండస్ట్రీ మొత్తం విషాదంలో కూరుకుపోయి ఉంది. ఈ తరుణంలో మరో షాకింగ్ వార్త అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇక లేరు.

చిత్ర పరిశ్రమకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అలనాటి నాటి జమున మరణంతో మరణంతో ఇండస్ట్రీ మొత్తం విషాదంలో కూరుకుపోయి ఉంది. ఈ తరుణంలో మరో షాకింగ్ వార్త అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఇక లేరు. గుండె పోటు రావడంతో శుక్రవారం ఆయన అకస్మాత్తుగా మరణించారు. 

ఎన్నో ఏళ్ళ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస మూర్తి రాణిస్తున్నారు. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్ లాటి హీరోల నుంచి మనం వింటున్న తెలుగు వాయిస్ ఎవరిదో కాదు.. శ్రీనివాస మూర్తిదే. ముఖ్యంగా  సూర్య సింగం చిత్రంలో డైలాగ్స్ అంతగా పాపులర్ అయ్యాయి అంటే అందులో శ్రీనివాస మూర్తి అందించిన పవర్ ఫుల్ వాయిస్ పాత్ర ఎంతైనా ఉంది. 

'సింహాన్ని నువ్వు పేపర్ లో చూసి ఉంటావు, టివిలో చూసి ఉంటాడు.. కానీ గంభీరంగా నడవడం చూశావా.. జూలు విప్పు కసిగా వేటాడడం చూశావా.. చాచి కొట్టానంటే ఒకటిన్నర టన్ను వెయిట్ రా.. చూస్తావా చూస్తావా' అంటూ సూర్య నిజమైన సింగం లాగా గర్జించిన ఆ వాయిస్ శ్రీనివాస మూర్తిదే. సూర్య, మోహన్ లాల్, అజిత్, రాజశేఖర్ లాంటి హీరోలకు ప్రేక్షకులు శ్రీనివాస మూర్తి గొంతుతో అలవాటు పడిపోయారు. 

ఇప్పుడు ఆ హీరోలకు శ్రీనివాస మూర్తి తరహాలో పవర్ ఫుల్ వాయిస్ అందించే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఆ హీరోలకు శ్రీనివాస్ మూర్తి మరణం తీరని నష్టం అనే చెప్పాలి. 

అపరిచితుడు, సింగర్ సిరీస్, అలవైకుంఠపురములో చిత్రంలో జయరామ్ కి, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కి ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల వెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాస మూర్తి పాత్ర ఉంది.  

శ్రీనివాస మూర్తి హఠాన్మరణంతో ఆయన సన్నిహితులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. శ్రీనివాస మూర్తి తెరవెనుక గర్జించే సింగం అని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

click me!