జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ కి జంటగా సదా నటించారు. ఈ మూవీలో సదా అగ్రహారం అమ్మాయిగా చాలా పద్ధతి గల పాత్ర చేశారు. అపరిచితుడు రేంజ్ హిట్ సదాకు మరలా పడలేదు.