ఎపిసోడ్ ప్రారంభంలో సులోచన, సుహాసిని ఇద్దరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సంగీత్ లో ఆడపెళ్లి వాళ్ళమే గెలవాలి అంటుంది సులోచన. నువ్వు ఇలాంటి ఓల్డ్ స్టెప్స్ వేస్తే మనం పోటీలో గెలవము అని ఆట పట్టిస్తుంది సుహాసిని. అలా ఏం కాదు అత్తగారు డాన్స్ చేస్తే అదిరిపోతుంది అంటూ ఎంకరేజ్ చేస్తాడు సుహాసిని భర్త.