ప్రేమకు ఎవరూ అతీతులు కాదు. ఏదో ఒక వయసులో ఎవరో ఒకరికి ఫ్లాట్ కావాల్సిందే. అందం, గుణం, మంచితనం ఏదో ఒక కారణంతో ఒకరి వైపు మన మనసు మళ్లుతుంది. వెండితెర మీద పద్ధతిగల పాత్రలు చేసే సాయి పల్లవికి కూడా ఓ లవ్ స్టోరీ ఉందట. ఆ అందమైన ప్రేమ కథను సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
26
సాయి పల్లవి మాట్లాడుతూ... ఏడో తరగతి చదువుతున్న రోజుల్లో నా క్లాస్ మేట్ అంటే నాకు ఇష్టం ఏర్పడింది. అతనంటే ఎందుకో తెలియని ప్రేమ. నా ప్రేమను ఆ అబ్బాయికి తెలియజేయాలనుకున్నాను. నేరుగా చెప్పడానికి భయమేసి లెటర్ రాశాను. కానీ ఆ లెటర్ ఇవ్వలేకపోయాను. నా పుస్తకాల్లో ఆ లవ్ లెటర్ పెట్టాను.
36
అనుకోకుండా ఆ లెటర్ అమ్మ చూసింది. నన్ను చితక్కొట్టింది. మా అమ్మ నన్ను కొట్టడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అప్పటి నుండి అమ్మకు కోపం తెప్పించే ఏ పనీ నేను చేయను. నా వరకు మా అమ్మ ఒక హీరోయిన్. రోల్ మోడల్, అని సాయి పల్లవి తన లవ్ స్టోరీ బయటపెట్టారు. సాయి పల్లవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
46
Image: Sai Pallavi / Instagram
ఇటీవల సాయి పల్లవి సినిమాలు తగ్గించేశారు. తెలుగులో సాయి పల్లవి చివరి చిత్రం విరాటపర్వం. తమిళంలో గార్గి. ఈ క్రమంలో సాయి పల్లవి సినిమాలు మానేశారని ప్రచారం జరిగింది. ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని, డాక్టర్ గా సేవలు అందించేందుకు సిద్దమయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సాయి పల్లవి ఖండించారు.
56
Sai Pallavi
మంచి స్క్రిప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరు తమ ఇంట్లో అమ్మాయిగా భావిస్తారు. కాబట్టి నేను ఎంచుకునే పాత్రలు ఉన్నతంగా ఉండాలి. మరింతగా అభిమానులను ఎంటర్టైన్ చేయాలి. అందుకే ఆలస్యం అవుతుంది. కథ నచ్చితే ఈ భాషలోనైనా మూవీ చేస్తాను, అన్నారు.
66
Sai Pallavi
ప్రస్తుతం సాయి పల్లవి హీరో శివ కార్తికేయన్ కి జంటగా ఓ మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. పుష్ప 2లో సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి విశ్వసనీయ సమాచారం లేదు. పుష్ప 2 లో సాయి పల్లవి నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా...