అంతే కాదు ఈసినిమా తరువాత మెగాస్టార్ మాటల ప్రభావంతో వరుసగా కామెడీ పాత్రలు తనను వరించాయట. వచ్చిన ప్రతీ పాత్ర కామెడీ రోల్ అయ్యింది. అలా తెలియకుండానే 500 సినిమాల వరకూ చేశారట రఘుబాబు.
ఇలా మెగాస్టార్ చిరంజీవి తనకు తెలియకుండానే ఓ చిన్న మాట సాయంతో స్టార్ కమెడియన్ కు అవకాశాలు వచ్చేలా చేశారు. ఇక రఘుబాబు గురించి చెప్పుకుంటే.. ఆయన వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చారు. రఘబాబు ఎవరో కాదు స్టార్ యాక్టర్ గిరిబాబు తనయుడు.
గిరిబాబు ఒకప్పుడు గొప్ప నటుడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ దగ్గర నుంచి మహేష్ బాబు వరకూ మూడు తరాల వారితో నటించాడు. ప్రస్తుతం కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నారు. ఆయన వరసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. రఘుబాబు తన సొంత ఇమేజ్ తోనే ఎదిగారు. తండ్రి పేరు మాత్రం ఎక్కడా చెప్పుకోలేదు.