రజినీకాంత్ కెరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్ సినిమా అంటే అది బాబా. 2002లో విడుదలైన ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో రజినీ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుండటంతో, సినిమాలో కూడా రాజకీయ డైలాగులు ఎక్కువగా పెట్టారు. వీటన్నింటినీ నమ్మి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
ఈ సినిమా విడుదలైన సమయంలో కేవలం 1 కోటి మాత్రమే వసూలు చేసింది. తర్వాత 2023లో రజినీ పుట్టినరోజు సందర్భంగా క్లైమాక్స్‌ను మార్చి బాబా సినిమాను రీ-రిలీజ్ చేశారు. అప్పుడు ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. రీ-రిలీజ్‌లో మొదటి రోజే రూ.1.4 కోట్లు వసూలు చేసింది.