
Kiss Day Special: సినిమాల్లో కిస్ అంటే ప్రస్తుతం పెద్ద విషయం కాదు. ఒకప్పుడు ఇలాంటివి పెద్ద విషయంగా తీసుకునేవారు. కాని ఇప్పుడు టాలీవుడ్ లో కూడా హీరో హీరోయిన్ల మధ్య కిస్ సాంప్రదాయం వచ్చేసింది. ఇక బాలీవుడ్ అయితే అంతకు మించి అడల్ట్ కంటెంట్ తో దూసుకుపోతోంది. ఇక సినిమాల్లో కిస్ అనగానే అందరికి సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హాష్మీ గుర్తుకు వస్తాడు. హీరోయిన్ తో ఆయన ఘాటు ముద్దులు అందరికి తెలిసినవే. కాని ఇమ్రాన్ ను మించి కిస్సులలో రికార్డ్ కొట్టిన హీరో ఒకరు ఉన్నారు ఆ హీరో ఎవరంటే..?
ఆ హీరోఎవరో కాదు, ఆమిర్ ఖాన్! అవును సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన 30 ఏళ్ల కెరీర్‌లో 14 మంది హీరోయిన్లతో ఆన్-స్క్రీన్ కిస్సింగ్ సీన్స్ చేశారు.ఈ కిస్సులు లెక్క వేస్తే.. 100 దాటవచ్చు. ఇంతకీ అమీర్ ఖాన్ కిస్ లిస్ట్‌లో ఎవరెవరున్నారో కిస్ డే స్పెషల్ లో తెలుసుకుందాం.వాలెంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13న కిస్ డే. ఈ సందర్భంగా 30 ఏళ్లలో 14 మంది హీరోయిన్లను ముద్దు పెట్టుకున్న బాలీవుడ్ సీరియల్ కిస్సర్ గురించి తెలుసుకుందాం. అమీర్ ఖాన్ కిస్ ఇచ్చిన హీరోయిన్ల లిస్ట్. ఏ సినిమాలో ఎవరికి కిస్ ఇచ్చాడో చూద్దాం.
1- కిటు గిడ్వాని
సినిమా - హోలీ
1984లో వచ్చిన 'హోలీ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమిర్ తన తొలి సినిమాలోనే నటి కిట్టూ గిడ్వానీని ముద్దు పెట్టుకున్నారు. ఇంకా చాలా సినిమాల్లో ఆయన హీరోయిన్లను ముద్దు పెట్టుకున్నారు.
2- జూహీ చావ్లా
సినిమా - ఖయామత్ సే ఖయామత్ తక్
1988లో విడుదలైన సినిమా ఇది. ఆమిర్ ఖాన్, జూహీ చావ్లా నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో ఇద్దరూ ముద్దు సన్నివేశంలో నటించారు. ఈ సినిమా ఆ కాలంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
3- మాధురి దీక్షిత్
సినిమా - దిల్
1990 బ్లాక్‌బస్టర్ మూవీ 'దిల్'లో ఆమిర్ ఖాన్, మాధురి దీక్షిత్‌ల ముద్దు సన్నివేశం సంచలనం సృష్టించింది. అయితే, మాధురి దీక్షిత్ ఇంతకు ముందు 'దయావాన్' సినిమాలో వినోద్ ఖన్నాతో లిప్‌లాక్ చేశారు.
4- పూజా బేడీ
సినిమా - జో జీతా వోహి సికందర్
1992లో వచ్చిన 'జో జీతా వహీ సికందర్'లో ఆమిర్ ఖాన్‌కి ముద్దుల సహనటిగా అప్పటి హాట్ మోడల్, నటి పూజా బేడీ నటించారు. పూజా బేడీ నటుడు కబీర్ బేడీ కుమార్తె.
5- మనీషా కొయిరాలా
సినిమా - అకేలే హమ్ అకేలే తుమ్
1995లో 'అకేలే హమ్ అకేలే తుమ్' సినిమాలో ఆమిర్ ఖాన్ నటి మనీషా కొయిరాలాతో లిప్‌లాక్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆమిర్-మనీషా జోడీ 'మన్' సినిమాలో కనిపించింది.
6- మమతా కులకర్ణి
సినిమా - బాజీ
1995లోనే వచ్చిన మరో సినిమా 'బాజీ'లో ఆమిర్ ఖాన్ నటి మమతా కులకర్ణితో లిప్‌లాక్ సీన్ ఇచ్చారు. సినిమాలోని పాట ఆ కాలంలో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచింది.
7- కరిష్మా కపూర్
సినిమా - రాజా హిందుస్తానీ
1996లో వచ్చిన 'రాజా హిందుస్తానీ' సినిమాలో ఆమిర్ ఖాన్, కరిష్మా కపూర్‌తో ఇప్పటివరకు అత్యంత సుదీర్ఘమైన ముద్దు సన్నివేశంలో నటించారు. వర్షంలో చిత్రీకరించిన ఈ సన్నివేశంలో ఆమిర్ ఖాన్ కరిష్మా కపూర్‌ని 40 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు.
8- జూహీ చావ్లా
సినిమా - ఇష్క్
1997లో వచ్చిన 'ఇష్క్' సినిమాలో జూహీ చావ్లా, ఆమిర్ ఖాన్ మధ్య అదిరిపోయే లిప్‌లాక్ సీన్ ఉంది. ఆమిర్‌తో ఇది జూహీ చావ్లా రెండో ముద్దు సన్నివేశం.
9- రాణీ ముఖర్జీ
సినిమా - గులాం
1998లో రాణీ ముఖర్జీ, ఆమిర్ నటించిన 'గులాం' సినిమా విడుదలైంది. ఇందులో ఇద్దరి మధ్య ముద్దు సన్నివేశం ఉంది. సినిమాలోని ఓ పాటలో కూడా జంట ఘాటు రొమాన్స్ చేసింది.
10- సోనాలీ బింద్రే
సినిమా - సర్ఫరోష్
1999లో విడుదలైన 'సర్ఫరోష్' సినిమాలోని 'రొమాంటిక్ పాటలో ఆమిర్ ఖాన్, సోనాలీ బింద్రే ముద్దు సన్నివేశంలో నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.
11- ట్వింకిల్ ఖన్నా
సినిమా - మేళా
2000లో వచ్చిన 'మేళా' సినిమాలో ఆమిర్ ఖాన్ ట్వింకిల్ ఖన్నాతో ముద్దు సన్నివేశంలో నటించారు. ఈ సినిమా తర్వాత 2001లో ట్వింకిల్ అక్షయ్ కుమార్‌ని వివాహం చేసుకున్నారు.
12- ఆలిస్ పాటన్
సినిమా - రంగ్ దే బసంతి
2006లో ఆమిర్ ఖాన్ 'రంగ్ దే బసంతి' సినిమాలో విదేశీ నటి ఆలిస్ పాటన్‌ని ముద్దు పెట్టుకున్నారు. ఆలిస్ ప్రముఖ బ్రిటిష్ కన్జర్వేటివ్ రాజకీయ నాయకుడు క్రిస్ పాటన్ కుమార్తె.
13- కరీనా కపూర్
సినిమా - 3 ఇడియట్స్
2009లో వచ్చిన '3 ఇడియట్స్' సినిమాలో ఆమిర్ ఖాన్ కరీనా కపూర్‌ని ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకునేటప్పుడు ముక్కు ఎలా అడ్డు రాదో సినిమాలో కరీనా కపూర్‌తో కలిసి చూపించారు.
14- కత్రినా కైఫ్
సినిమా - ధూమ్ 3
2013లో వచ్చిన 'ధూమ్ 3' సినిమాలో ఆమిర్ ఖాన్ కత్రినా కైఫ్‌తో ముద్దు సన్నివేశంలో నటించారు.