హీరోగా ఎంట్రీకి ముందే చిరంజీవిని భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌ కొడుకు.. కట్‌ చేస్తే చిరు ఊహించిందే జరిగింది

Published : Jun 02, 2025, 07:38 AM ISTUpdated : Jun 02, 2025, 08:00 AM IST

మెగాస్టార్‌ చిరంజీవికి తన కెరీర్‌ జర్నీలో చాలా మంది హీరోలు పోటీ ఇచ్చారు. చిరు మాత్రం ఎవరికీ భయపడలేదు. కానీ ఓ హీరో కటౌట్‌ చూసి భయపడిపోయారట. ఆయన హీరో కాకుంటే బాగుండూ అనుకున్నారట.

PREV
17
ప్రొడ్యూసర్‌ కొడుకుని చూసి భయపడ్డ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవికి తన కెరీర్‌ ప్రయాణంలో చాలా మంది హీరోలు పోటీగా వచ్చారు. సుమన్‌, రాజశేఖర్‌ వంటివారు గట్టి పోటీని ఇచ్చారు. ఓ దశలో తననే డామినేట్‌ చేశారు. వాళ్లెవరికీ చిరు భయపడలేదు, కానీ ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కొడుకుని చూసి మాత్రం మెగాస్టార్‌ భయపడ్డాడు. ఆయన హీరో కాకుండా ఉంటే బాగుండు అని మనసులో అనుకున్నారట. మరి ఆ కథేంటో చూద్దాం.

27
లెజెండ్స్ కి పోటీగా ఎదిగిన చిరంజీవి

చిరంజీవి ఎలాంటి బాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు వంటి లెజెండ్స్ ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. వారి పోటీని తట్టుకుని నిలబడాలి, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చెప్పి చిరంజీవి.. డాన్సులు, యాక్షన్‌ విషయంలో ఎంతో కష్టపడ్డారు. వెండితెరపై సక్సెస్‌ అయ్యారు. అందరు ఆశ్చర్యపోయేలా చేశారు. అనతి కాలంలోనే హీరోగా నిలబడ్డారు. చూస్తుండగానే స్టార్‌గా ఎదిగారు.

37
స్టార్‌ ప్రొడ్యూసర్‌ కొడుకు కటౌట్‌ చూసి భయపడ్డ చిరు

ఆ టైమ్‌లో చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. తన సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమా సెట్‌కి వెళ్లారు చిరంజీవి. అది ఒక స్టార్‌ ప్రొడ్యూసర్‌ సినిమా.  అక్కడ ఆ నిర్మాత కొడుకుని చూశారు చిరు, హైట్‌, లుక్‌ పరంగా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, తనకంటే అందంగా ఉన్నాడు, చూడ్డానికి అదిరిపోయాడు. వామ్మో ఇతను సినిమాల్లోకి వస్తే మన పని అయిపోయినట్టే అని చిరంజీవి మనసులో అనుకున్నారట. ఒకింత టెన్షన్‌ స్టార్ట్ అయ్యిందట.

47
నిర్మాత చెప్పిన మాటతో ఊపిరిపీల్చుకున్న మెగాస్టార్‌

చిరు రావడంతోనే.. `రా రాజా` అంటూ పిలిచిన ఆ నిర్మాత మా అబ్బాయి అంటూ ఆయన్ని పరిచయం చేశారు. ఏం చేస్తున్నాడని చిరు అడిగితే `మాస్టర్స్ చేస్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, నాకు చెప్పి వెళ్లడానికి సెట్‌కి వచ్చాడు` అని చెప్పాడట నిర్మాత. సినిమాల్లోకి రావడం లేదా అని చిరు అడిగితే `అబ్బే లేదు, చదువుకుంటా అంటున్నాడ`ని నిర్మాత చెప్పడంతో మెగాస్టార్‌ ఊపిరి పీల్చుకున్నాడు. హమ్మయ్య మనం సేఫ్‌ అనుకున్నారట చిరు.

57
నిర్మాత మాటతో చిరంజీవి గుండెల్లో బాంబ్‌

కట్‌ చేస్తే రెండేళ్ల తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడట ఆ నిర్మాత కొడుకు. ఆ టైమ్‌లో నిర్మాత కలిస్తే, ఏంటి సార్‌ మీ అబ్బాయి చదువుకోవడం లేదా? అని చిరు అడిగితే, లేదు రాజా సినిమాల్లో చేస్తానంటున్నాడని చెప్పేసరికి చిరుకి గుండెల్లో బాంబ్‌ పడినట్టయ్యిందట. ఒక్కసారిగా నీరసం వచ్చేసిందట. కానీ అప్పట్నుంచి ఇప్పటివరకు తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నామని, ఒకరి బాగుని మరొకరం కోరుకున్నామని, పరస్పర ప్రోత్సాహంతో ఇక్కడ వరకు వచ్చామని తెలిపారు చిరంజీవి.

67
చిరంజీవిని భయటపెట్టిన వెంకటేష్‌

ఇంతకి కటౌట్‌తోనే చిరంజీవిని భయపెట్టిన హీరో ఎవరో కాదు స్టార్‌ ప్రొడ్యూసర్‌ దగ్గుబాటి రామానాయుడు తనయుడు, హీరో విక్టరీ వెంకటేష్‌. 1986లో `కలియుగ పాండవులు` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్‌. సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ మూవీ చేయనని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో వెంకీని హీరోగా మార్చేశారు రామానాయుడు. అలా వెంకీ హీరో అయ్యాడు, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ అయ్యారు. ఎక్కువ సక్సెస్‌ రేట్‌తో `విక్టరీ`ని తన ఇంటిపేరుగా మార్చుకుని రాణిస్తున్నారు.

77
చిరు, వెంకీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్

చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి స్టార్లకి పోటీ ఇచ్చారు వెంకీ. తనకంటూ సెపరేట్‌ జోనర్‌ని ఫిక్స్ చేసుకుని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకీకి ఉన్న ఫాలోయింగ్‌ మరే హీరోకి లేదని చెబితే అతిశయోక్తి కాదు. అలా వెంకీ గురించి చిరంజీవి సరదాగా చెప్పిన ఈ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వెంకీ 75వ మూవీ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్న మెగాస్టార్ సరదాగా ఈ విషయాన్ని  వెల్లడించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories