త్రిష ఇటీవల అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాలో మెరిసింది. మంచి హిట్‌ని అందుకుంది. త్వరలో `థగ్ లైఫ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న విడుదల కాబోతుంది.
అలాగే ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరో సూర్యకి జోడీ కట్టింది త్రిష. అంతేకాకుండా తెలుగులో చిరంజీవితో కలిసి 'విశ్వంభర' చిత్రంలోనూ నటిస్తుంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి ఓ మూవీ చేస్తుంది. ఇలా తెలుగు, తమిళం, మలయాళంలో భారీ చిత్రాలతో బిజీగా ఉంది త్రిష.