ఎన్టీఆర్‌ భయపడ్డాడు, అదే కథతో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సూపర్‌స్టార్‌ కృష్ణ, డేర్‌ అంటే ఇది

Published : Jun 01, 2025, 08:43 PM ISTUpdated : Jun 01, 2025, 10:57 PM IST

ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య సినిమాల పరంగా పోటీ బాగానే నడించింది. కానీ ఓ మూవీ విషయంలో రామారావు భయపడ్డాడు, కానీ కృష్ణ ధైర్యంతో ముందుకెళ్లి ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు.

PREV
16
ఎన్టీఆర్‌, కృష్ణల మధ్య పోటీ

ఎన్టీ రామారావుకి, సూపర్‌ స్టార్‌ కృష్ణకి అప్పట్లో మధ్య సినిమాల పరంగా పోటీ ఉండేది. ఓ వైపు పౌరాణిక చిత్రాలతోపాటు, యాక్షన్‌ మూవీస్‌ కూడా చేసి మెప్పించారు ఎన్టీఆర్‌. కానీ యాక్షన్‌ మూవీస్‌కి కేరాఫ్‌గా నిలిచారు కృష్ణ. 

దీంతో యాక్షన్‌ సినిమాల విషయంలో వీరిమధ్య పోటీ ఉండేది. కొన్ని ఎన్టీఆర్‌ చేయాలనుకున్న సినిమాలు కృష్ణ చేశారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే కథతో పోటీగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

26
ఎన్టీఆర్‌ వద్దు అని చెప్పిన కృష్ణ వినలేదు

కానీ ఓ కథ విషయంలో ఎన్టీఆర్‌ భయపడ్డాడు. అంతేకాదు సూపర్‌ స్టార్‌ కృష్ణని కూడా చేయోద్దని చెప్పారు. కానీ కృష్ణ మాత్రం వినలేదు. ఎన్టీఆర్‌ మాటని లెక్కచేయకుండా సినిమా చేశాడు. అంతేకాదు దర్శకుడు అనారోగ్యానికి గురైతే తానే డైరెక్ట్ చేశాడు. 

పలు అడ్డంకులు వచ్చినా లెక్కచేయలేదు. ఎట్టకేలకు సినిమా తీసి ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. ఆ మూవీ ఇప్పటికీ కృష్ణ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

36
`అల్లూరి సీతారామారాజు` చేసేందుకు భయపడ్డ కృష్ణ

కృష్ణ అలాంటి డేరింగ్‌ స్టెప్ తో చేసిన సినిమానే `అల్లూరి సీతారామరాజు`. ఈ మూవీ కథని మొదట ఎన్టీఆర్‌ రెడీ చేసుకున్నారు. తన రైటర్స్ తో స్క్రిప్ట్ అంతా ప్రిపేర్‌ చేయించారు. కానీ ప్రారంభించలేదు. చాలా కాలం ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు.

 ఇలాంటి సినిమా చేస్తే జనం చూడరని ఆయన ఉద్దేశ్యం. రిస్క్ ఎందుకు ఆయన భావించాడు. ఎంత సేపు బాణాలు వేసుకోవడం తప్ప, ఫైట్స్ లేవు ఏం లేవు, హీరోకి బట్టలు కూడా ఉండవు, సినిమా మొత్తం ఒకే డ్రెస్‌లో ఉండాలి, ఇలాంటి సినిమాని ఆడియెన్స్ చూడరు, పైగా తాను చేస్తే అస్సలే చూడరు అని రామారావు భావించారు. అందుకే వెనకడుగు వేశారు.

46
సూపర్‌స్టార్‌ కృష్ణ డేరింగ్‌ స్టెప్‌

ఈ విషయం సూపర్‌ స్టార్‌ కృష్ణకి తెలిసింది. దీంతో ఆయన ఈ మూవీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్‌ని కలిశారు, మీరు చేయనంటే నేను చేస్తానని చెప్పారు, ఆ సమయంలో `వద్దు బ్రదర్‌, ఈ సినిమాని ఆడియెన్స్ చూడరు, ఆడదు, అనవసరంగా రిస్క్ చేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటారు` అని రామారావు చెప్పారట. కానీ కృష్ణ వినలేదు. ధైర్యంగా ముందుకెళ్లారు.

56
సినిమా ప్రారంభించిన తొలి రోజే దర్శకుడికి హార్ట్ ఎటాక్‌

వీ రామచంద్రరావు దర్శకత్వంలో సినిమాని ప్రారంభించారు. చింతపల్లి ఫారెస్ట్, కృష్ణదేవి పేట ఫారెస్ట్ లో మూవీని షూట్‌ చేశారు. అయితే సినిమా ప్రారంభించిన రోజే దర్శకుడు వీ రామచంద్రరావుకి హార్ట్ ఎటాక్‌ వచ్చింది. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులు చికిత్ప పొంది ఆయన కన్నుమూశారు. 

దీంతో తప్పని పరిస్థితుల్లో తానే దర్శకుడిగా మారారు కృష్ణ. సినిమా మొత్తాన్ని ఆయనే డైరెక్ట్ చేశారు. కానీ దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం రామచంద్రరావు పేరుని డైరెక్టర్‌ కార్డ్ లో వేశారు. అంతేకాదు ఆయన ఫ్యామిలీకి పారితోషికం కూడా పంపించారు.

66
`అల్లూరి సీతారామరాజు` సంచలన విజయం

అయితే `అల్లూరి సీతారామరాజు` సినిమాకి తానే దర్శకత్వం వహించినా తన పేరు వేసుకోలేదు కృష్ణ. ఇలా `అల్లూరి సీతారామరాజు` చిత్రంతో దర్శకుడిగా మారారు కృష్ణ. కానీ ఆయన అధికారికంగా దర్శకుడిగా మారింది మాత్రం `సింహాసనం` చిత్రంతో. 

ఇక 1974, మే 1న విడుదలైన `అల్లూరి సీతారామరాజు` మూవీ సంచలన విజయం సాధించింది. అందరి అంచనాలను తలకిందులు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే కోటి రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ రాబట్టడం విశేషం. ఈ మూవీతో కృష్ణ ఇమేజ్‌ మారిపోయింది. తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories