మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీకి లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరు స్టార్లతో సినిమా చేయబోయే డైరెక్టర్ పై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. చిరంజీవి చాలాగ్యాప్ తరువాత రాబోతుండటంతో.. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా మన శంకర వరప్రసాదుగారు ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిరంజీవితో పాటు, వెంకటేష్ కూడా పాల్గొన్నారు. అంతే కాదు అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి విషయాలను మెగాస్టార్ బయటపెట్టారు.
25
చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ ..
మన శంకర్ వరప్రసాదు గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే... ఈ సినిమాలో చిరంజీవితో కలిసి స్టెప్పులు కూడా వేశాడు విక్టరీ స్టార్. అయితే ఈసినిమాలో గెస్ట్ రోల్ కే పరిమితం అయిన ఈ స్టార్ కాంబో.. పుల్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపిస్తే.. అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ ప్రకటన ఒకటి చేశారు. వెంకటేష్ తో సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
35
మెగాస్టార్ మాట్లాడుతూ..
మన శంకర్ వరప్రసాదు గారు ఈవెంట్ కు విక్టరీ .. వెంకటేష్ ను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. "వెంకటేష్ ఎప్పుడు లైఫ్, ఫిలాసఫీ మాట్లాడతాడు. నా కళ్లకు ఒక చిన్న సైజ్ గురువులా కనిపిస్తాడు.. అయిదేళ్ల క్రితం మేమిద్దరం అమెరికా వెళ్ళాము. అప్పుడు ఒకరింట్లో ఫొటో తీసుకుంటుంటుడగా.. నా వెనకాల వెంకీ నిల్చున్నాడు. అప్పుడే అనిపించింది.. నా వెనకాల వెంకటేష్ ఉంటే బాగుంటుంది అని. నేను అనిల్ కు ఈ విషయం చెప్పగానే.. మా ఇద్దర్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసాడు . సెట్ లో మేమిద్దరం సరదాగా అల్లరి చేసాము. షూటింగ్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశాము.'' అని చిరంజీవి అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. వెంకటేష్ తో నేను ఫుల్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను.. మంచి కథ కుదిరితే ఇద్దరం కలిసి నటిస్తాము.. అనిల్ రావిపూడి కథ రెడీ చేసుకో.. అని చిరు అన్నారు. అటు వెంకటేష్ కూడా చిరంజీవితో నటించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే..పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో కలిసి నటించాను.. చిరంజీవిగారి కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు వెంకటేష్ వెల్లడించాడు. అన్నీ కుదిరి.. అనిల్ రావిపూడి కరెక్ట్ గా దృష్టి పెడితే.. ఈ రెండు మూడేల్లలో.. మెగాదగ్గుబాటి మల్టీ స్టారర్ అభిమానులను అలరిస్తుందనడంతో సందేహం లేదు. మరి ఈసినిమా నిజంగా వర్కౌట్ అవుతుందా..? లేదా చూడాలి.
55
అనిల్ ఏం మాయ చేశాడో..?
మెగాస్టార్ మాట్లాడుతూ.. ''అసలు నయనతార ప్రమోషన్స్ కు రావడం ఏంటి.. అనిల్ ఏం మాయ చేసి ఆమెను ఒప్పించాడో, ఆమెతో నేను రెండు సినిమాలు చేశాను.. కానీ అప్పుడు ఇలా జరగలేదు.. మరి ఆ సీక్రేట్ ఏంటీ అనేది అనిల్ రావిపూడికే తెలియాలి. నా కెరీర్ లో ఇప్పటి వరకు ర్యాప్ సాంగ్ చేయలేదు.. కానీ ఈ సినిమాతో అది కూడా పూర్తి అయ్యింది.. ఈ సాంగ్ థియేటర్లో హైలెట్ అవుతుంది"'. అని చిరంజీవి అన్నారు.