Balu Movie: పవన్‌ కళ్యాణ్‌ `బాలు`ని రిజెక్ట్ చేసిన స్టార్‌ హీరోయిన్ ఎవరో తెలుసా? మరో స్టార్‌కి ఇచ్చిన మాట కోసం

Published : Jan 08, 2026, 10:56 AM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రాల్లో `బాలు` ఒక ట్రెండ్‌ సెట్టర్‌. దీనికి సంబంధించిన తెరవెనుక చాలా విషయాలు ఇప్పుడు ఆసక్తికరం. ఒక స్టార్‌ హీరోయిన్‌ పవన్‌కి హ్యాండిచ్చింది. 

PREV
15
పవన్‌ కళ్యాణ్‌ `బాలు` మూవీ 21ఏళ్లు పూర్తి

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పలు బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ చేశారు. మరికొన్ని డిజాస్టర్స్ చేశారు. కానీ కొన్ని సినిమాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. యూత్‌లో ట్రెండ్‌ సెట్ చేసిన మూవీస్‌లో `బాలు` ఒకటి. కరుణాకరన్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. తనకు `తొలి ప్రేమ`వంటి ఇండస్ట్రీ హిట్‌ని, కల్ట్ మూవీని అందించిన కరుణాకర్‌తో మరోసారి ఈ సినిమా చేశారు పవన్‌. ఇది 2005 జనవరి 6న విడుదలైంది. ఇటీవలే 21 ఏళ్లు పూర్తి చేసుకుంది.

25
బాలులో తేజా సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్

ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఇప్పుడు స్టార్‌ హీరోగా రాణిస్తోన్న తేజ సజ్జా బాలనటుడిగా నటించారు. చిన్న స్కూల్‌ కుర్రాడిగా చెర్రీ పాత్రలో కనిపించాడు తేజా. పవన్‌కి జోడీగా శ్రియా శరణ్‌, నేహా ఒబేరాయ్‌ హీరోయిన్లుగా నటించారు. `బాలు` సినిమా నిజానికి యావరేజ్‌గా ఆడింది. కానీ నిర్మాతలకు మాత్రం పెద్దగా నష్టాలను తీసుకురాలేదు. ఈ మూవీ రూ.15కోట్లతో నిర్మిస్తే, రూ.14కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్‌ షేర్‌ని వసూలు చేసింది. కొద్దిపాటి నష్టాలను తీసుకొచ్చింది.

35
బాలు తెరవెనుక స్టోరీ

`బాలు` సినిమాని ఫలితంతో సంబంధం లేకుండా కామన్‌ ఆడియెన్స్, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఇందులో పాటలను తెగ ఎంజాయ్‌ చేస్తారు. పిల్లలతో వచ్చే ఫస్ట్ సాంగ్‌ ఊపేస్తుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పాటలు మంచి హిట్‌ అయ్యాయి. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. సినిమా పూర్తి టైటిల్‌ `బాలు ఏబిసిడిఈఎఫ్‌జీ` అంటే `ఏ బాయ్‌ కెన్‌ డూ ఎవర్రీథింగ్‌ ఫర్‌ గర్ల్`. అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏమైనా చేస్తాడనేది దాని అర్థం. ఈ మూవీ షూటింగ్‌ ఎక్కుగా ఢిల్లీ, ఆగ్రా లో చేశారు. తాజ్‌ మహల్‌ సమీపంలో చిత్రీకరణ జరిగింది. ఆర్‌ఎఫ్‌సీలో హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ సెట్‌ వేశారు. దానికి ఏకంగా రూ.90లక్షల ఖర్చు అయ్యింది.

45
కార్గో ప్యాంట్లలో ట్రెండ్ సెట్టర్

దీంతోపాటు ఈ మూవీ ప్యాంట్ల విషయంలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కార్గో ప్యాంట్‌ ధరించారు. ఆ తర్వాత దెబ్బకి లక్షా కార్గో ప్యాంట్లు అమ్ముడు పోయాయి. ఈ మూవీ చూసిన తర్వాత అభిమానులు ఈ ప్యాంట్లని తెగ కొన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్యాంట్ల కోసం ఇటలీ వెళ్లారు పవన్‌. రెండు లక్షలు వెచ్చించి ప్యాంట్లని కొన్నాడట. అది నిర్మాతకి బర్డెన్‌ కాకూడదని ఆ తర్వాత వాటి ఖర్చు పవన్‌ కళ్యానే భరించినట్టు సమాచారం.

55
బాలుని రిజెక్ట్ చేసిన హీరోయిన్‌ నమ్రత

ఇక ఫైనల్‌గా ఈ మూవీలో శ్రియా హీరోయిన్‌గా మొదటి ఛాయిస్‌ కాదు. మహేష్‌ బాబు భార్య నమ్రతని హీరోయిన్‌గా అనుకున్నారు. నిర్మాత అశ్వినీదత్‌ ఆమెతో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో హ్యాండించింది. తాను చేయలేనని చెప్పింది. దానికి కారణం అప్పటికే నమ్రత మహేష్‌ బాబుతో ప్రేమలో ఉంది. ఆ సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయోద్దనేది వాళ్ల మధ్య ఉన్న అండర్‌ స్టాండింగ్‌. దీంతో మహేష్‌ కి ఇచ్చిన మాట కోసం పవన్‌ కళ్యాణ్‌ `బాలు`ని రిజెక్ట్ చేసింది నమ్రత. ఆ తర్వాత శ్రియాని ఎంపిక చేశారు. అలా పవన్‌, నమ్రత కాంబినేషన్‌లో సినిమా మిస్ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories