ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్, పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి, నిజమెంత?

Published : Sep 03, 2025, 06:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ. చిరంజీవి ఫవర్ ఫుల్ రోల్, ప్రభాస్ కి మెగాస్టార్ తండ్రి పాత్రలో నటించోతున్నారా? ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రచ్చ చేయబోతున్నాడా? ఇంతకీ దర్శకుడెవరు, ఏంటా సినిమా? నిజమెంత? 

PREV
16

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' అనే సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా తరువాత చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కోసం కూడా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

26

ఇవి మాత్రమే కాకుండా, బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘మెగా 159’ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ వరుస సినిమాల నడుమ మెగాస్టార్ చిరంజీవి ఓ మరో ప్రత్యేక ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారన్న వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది.

36

తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ మూవీ ‘స్పిరిట్’ లో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ చేయనున్నారని టాక్. ఈ సినిమాలో చిరంజీవి ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

46

‘యానిమల్’ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ పోషించిన పాత్ర ఎలా హైలైట్ అయిందో.. అదే తరహాలో, ఒక రకంగా చెప్పాలంటే అంతకు మించి, మరింత ప్రభావవంతమైన పాత్రను సందీప్ వంగా చిరంజీవి కోసం రాసినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ గెస్ట్ రోల్ ద్వారా చిరు మార్క్ హీరోయిజం మరోసారి తెరపై కనిపించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

56

చిరంజీవిని సందీప్ వంగా ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం. మెగాస్టార్‌తో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలన్న వంగా కోరిక ఫ్యాన్స్‌కి తెలుసు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలోనూ “నా అభిమాన హీరో చిరంజీవి” అని చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు కూడా రెగ్యులర్‌గా వంగా‌ను ట్యాగ్ చేస్తూ, మెగా సినిమా చేయమని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు.

66

అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రచారం నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో ఇది ఓ మెగా సెన్సేషన్‌గా మారే అవకాశం ఉంది. మెగాస్టార్, రెబల్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించటం అభిమానులకే కాదు ఇండస్ట్రీకే ఓ పండుగే అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ ఫ్యాన్స్‌, మూవీ లవర్స్‌ ఈ వార్తకు సబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories