మాస్ నుంచి హారర్ వరకు.. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే

Published : Sep 03, 2025, 05:27 PM IST

Theater Releases This Week : సినిమా లవర్స్ కు పండగ వచ్చేసింది.సెప్టెంబర్ మొదటి వారం థియేటర్లలో పలు భాషల్లో సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇందులో యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్, హారర్, ఫ్యామిలీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

PREV
17
ఘాటీ (Ghaati)

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఘాటీ (GAATI).ఈ మూవీ సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. వేదం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనుష్క–క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క ఈ సినిమాలో పవర్‌ఫుల్ “షీలావతి” పాత్రలో అలరించనున్నారు. మాస్ యాక్షన్, ఎమోషన్స్ మేళవించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడవ్వడం సినిమాపై ఉన్న హైప్‌కు నిదర్శనం. ఈ సినిమా అనుష్క కెరీర్‌లో మరో మలుపు అవుతుందని, క్రిష్ డైరెక్షన్‌లో మరోసారి మ్యాజిక్ క్రియేట్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

27
లిటిల్ హార్ట్స్ (Little Hearts)

90s మిడిల్ క్లాస్ ఫేమ్ మౌళి తనుజ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ చిత్రాన్ని ETV Win Original Production బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించగా, బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలు చేపట్టారు. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

37
మదరాసి ( madharasi)

శివకార్తికేయన్ "మదరాసి"సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్నది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్, సీనియర్ నటుడు బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమాలు అందించిన ఏ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన స్టైల్‌లో యాక్షన్, ఎమోషన్స్ మేళవించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తోంది. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

47
'ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్' (The Bengal Files)

కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్’ సినిమాతో రానున్నారు. 1940లలో అవిభక్త బెంగాల్‌లో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే, నోఖాలి అల్లర్లు వంటి మతహింసలపై ఈ సినిమాను రూపొందించారు. ఈ కథను "హిందూ మారణహోమం"గా దర్శకుడు అభివర్ణించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మాతలు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. సెప్టెంబర్ 5, 2025న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

57
బాఘీ (Baaghi)

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ శ్రాఫ్ ‘బాఘీ 4’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో టైగర్ శ్రాఫ్ నటించిన గణపత్, హీరోపంటి 2, బడే మియాన్ చిన్నే మియాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అందుకే ఈసారి టైగర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. బాఘీ ఫ్రాంచైజీ మాత్రం టైగర్‌కు ఎప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ఇచ్చింది. బాఘీ 1, బాఘీ 2, బాఘీ 3 సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టి టైగర్‌కి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ హార్నాజ్ కౌర్ సందు హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండటం మరో ప్రత్యేకత.

67
లవ్ యూ రా (Love You Raa)

సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ లవ్ యూ రా (Love You Raa). ఈ సినిమాలో చిన్ను, గీతికా రతన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించగా, సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.

77
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్

హాలీవుడ్‌లో హారర్ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే ఫ్రాంచైజీలలో ది కంజూరింగ్ (The Conjuring)ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను భయపెట్టిన ఈ యూనివర్స్‌లోని కొత్త చాప్టర్ "ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్" వచ్చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5 న విడుదల కానున్నది. ఈ సినిమా కంజూరింగ్ యూనివర్స్‌లో తొమ్మిదవ సినిమా రాగా, మెయిన్ సిరీస్‌లో ఈ మూవీ నాలుగోది. ఈ మూవీకి మైఖేల్ చావెస్ దర్శకత్వం వహించగా, వెరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్ లు ప్రధాన పాత్రలో నటించారు. కంజూరింగ్ సిరీస్‌లోని గత సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కాబట్టి "లాస్ట్ రైట్స్" కూడా గత రికార్డులు బద్దలు కొడుతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories