లవ్ ట్రాక్ నడపడానికే బిగ్ బాస్ కి వచ్చింది.. రీతూ, అయేషా మధ్య రణరంగం

Published : Oct 20, 2025, 11:10 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం ఎవరెవరు నామినేషన్స్ లో నిలిచారో ఈ కథనంలో తెలుసుకోండి. సంచలన ఆరోపణలతో రీతూని అయేషా డైరెక్ట్ గా నామినేట్ చేసింది. 

PREV
15
రణరంగంగా మారిన బిగ్ బాస్ హౌస్ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో భాగంగా 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈవారం నామినేషన్స్ దద్దరిల్లాయి. కొందరు కంటెస్టెంట్స్ అయితే ఒకరిపై ఒకరు ఎక్కడ దాడి చేసుకుంటారో అని అనిపించేలా రచ్చ చెలరేగింది. బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, అయేషా లకు ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో వందలకొద్దీ బెలూన్స్ ఉంచారు. వాటిని పగలగొడితే కొన్ని చీటీలు బయటపడతాయి. అవి నామినేషన్స్ కి సంబంధించిన చీటీలు. వాటిని ఇమ్మాన్యుయేల్, అయేషా తాము కోరుకున్న వారికి ఇవ్వొచ్చు. ఆ విధంగా చీటీలు పొందిన వారు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది. 

25
లవ్ ట్రాక్ నడపడానికే రీతూ వచ్చింది 

అయేషా డైరెక్ట్ నామినేషన్ చీటీని తనవద్దే ఉంచుకుంది. దీనితో అయేషా ముందుగా రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. దీనికి అయేషా చెప్పిన రీజన్ సంచలనంగా ఉంది. రీతూ చేసే ఓవరాక్షన్ నాకు నచ్చట్లేదు.  రీతూ బిగ్ బాస్ కి వచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే. కెమెరాలో కనిపించడానికి అది చాలా సులభమైన మార్గం. ఎంతసేపు లవ్ ట్రాక్ లు నడుపుకుంటూ టైం గడుపుతోంది. గేమ్ అసలు ఆడట్లేదు అంటూ అయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. రీతూ కూడా అయేషా ఆరోపణలపై చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. రీతూ కూడా తిరిగి అయేషా ని నామినేట్ చేసింది. 

35
భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యారు 

ఈసారి వీరిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. రీతూని అయేషా పోవే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనితో ఒకరిపై ఒకరు దూకుతూ ఎక్కడ దాడి చేసుకుంటారో అని అనిపించేలా వాగ్వాదానికి దిగారు. మొత్తంగా రీతూ చౌదరి డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఆ తర్వాత దివ్య.. అయేషా, సాయి లని నామినేట్ చేసింది. సాయి తనని తాను డిపెండ్ చేసుకునే క్రమంలో ఈ హౌస్ లో ఫ్యామిలీని మైంటైన్ చేసింది నువ్వే అంటూ దివ్యకి కౌంటర్ ఇచ్చాడు. భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడు అంటూ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

45
తనూజ నటిస్తోంది, ఆమె ఫేక్ అంటూ కామెంట్స్ 

రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ ఒక రేంజ్ లో చెలరేగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. రమ్య మోక్ష.. తనూజని నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే. ఇలా తీవ్ర వ్యాఖ్యలతో రమ్య విరుచుకుపడింది. 

55
హర్ట్ అయిన ఇమ్మాన్యుయేల్ 

 కళ్యాణ్ సంజనని నామినేట్ చేశారు. ఈ విషయంలో ఇమ్మాన్యుయేల్ హర్ట్ అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ కి చీటీ ఇచ్చింది తనూజని నామినేట్ చేయడానికి. కానీ కళ్యాణ్ సంజనని నామినేట్ చేయడం ఇమ్మాన్యుయేల్ కి నచ్చలేదు. గౌరవ్ కి ఉన్న ప్రత్యేకమైన పవర్ తో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ కోరారు. దీనితో గౌరవ్ తాను అయేషాని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో రీతూ, సాయి, రాము, కళ్యాణ్, సంజన, దివ్య నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories