చిరంజీవి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి మెగాస్టార్ గా ఎదిగిన హీరో. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈ హీరో ఎన్నో గుప్త దానాలు కూడా చేశారు.. చేస్తున్నారు కూడా. వేల కోట్లకు అదిపతిగా మారిన చిరంజీవి ఒక్క రోజు ఖర్చు ఎంతో తెలుసా?
చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరో. వారసత్వం లేకుండా.. సొంత టాలెంట్ తో టాలీవుడ్ లో నిలబడి.. మెగాస్టార్ రేంజ్ ను సాధించాడు. అంది అందరికి సాధ్యం కాదు. కిందస్థాయి నుంచి రావడం వల్ల.. అన్ని విషయాలపై ఆయనకు అవగాహన ఉంది. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడ సాయం చేయాలి. ఎవరికి చేయూతనివ్వాలి.. ఇలాంటి విషయాలు తెలిసిన వ్యక్తి చిరంజీవి. అందుకే ఆయన చేసే సాయం బయటకు తెలియదు. ఎంత మందిని ఆదుకున్నారో ఎప్పుడు ఎవరికీ చెప్పరు. ఎంత ఖర్చు అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయాలను చిరంజీవికి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి రీసెంట్ గా వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే?
25
చిరంజీవి ఇంట్లో ఒక రోజు ఖర్చు ఎంత?
సినిమాలు, వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్.. ఇలా ఎన్నో మార్గాల ద్వారా.. కష్టపడి సంపాదించి.. మిడిల్ క్లాస్ నుంచి వేల కోట్లకు అధిపతిగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా.. తను ఎక్కడి నుంచి మొదలయ్యాడో అది మాత్రం మర్చిపోలేదు. ప్రస్తుతం ఆయన ఇంట్లో రోజుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
చిరంజీవి ఇంటి ఖర్చు లక్ష.. రెండు లక్షల వరకూ ఉంటుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ చిరంజీవి ఇంట్లో రోజకు తక్కువలో తక్కువ 25 లక్షల ఖర్చు ఉంటుందట. అయితే ఇదంతా ఆయన సొంత ఖర్చు కాదు.. ఫ్యామిలీ కోసం పెట్టే ఖచ్చు కాదు. రోజు మెగాస్టార్ నుంచి ఇతరులకు అందే సాయం ఖర్చు 25 లక్షలు. ఈ విషయాన్ని చిరంజీవిని ఎన్నో ఎళ్లుగా దగ్గర నుంచి గమనిస్తున్న ఓ అభిమాని వెల్లడించారు.
35
చిరంజీవి అభిమాని ఏం చెప్పాడంటే?
మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి అభిమానుల్లో డాక్టర్ సంపత్ ఒకరు. దాదాపు గా మెగాస్టార్ ను 30 ఏళ్ల నుంచి దగ్గరగా చూస్తున్నారు సంపత్. ఈయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ.. '' మెగాస్టార్ ఏరోజు తాను చేసిన దానాలు, సహాయాల గురించి చెప్పుకోలేదు. ఇంత చేస్తున్నాను నేను అని ఒక్క మాట ఎక్కడ అనలేదు. ఆయన బ్లడ్ బ్యాంక్ నుంచి వేలమంది ప్రాణాలు కాపాడారు.. కానీ ఆ విషయాన్ని ఇంత వరకూ ఎక్కడా ఆయన చెప్పుకోలేదు.
చిరంజీవి గారి ఇంటికి వెళ్లి సాయం పొందకుండా వచ్చినవారు ఉండరు. ఒక రోజకు ఆయన ఇంటి ఖర్చు ఎంతుంటుందో తెలుసా.. తక్కువలో తక్కువ 25 లక్షల వరకూ ఉంటుంది. గత 28 ఏళ్లుగా ఆయన్ను దగ్గర నుంచి చూస్తున్నారు. మెడికల్ హెల్ప్, దానాలు, చదువులు, ఫీజులు, ఇలా పెద్ద మొత్తంలో చిరంజీవి గారు సాయం చేస్తుంటారు. కానీ ఈ విషయం ఎక్కడా చెప్పుకోరు. అదే ఆయన గొప్పతనం'' అని సంపత్ ఇంటర్యూలో వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్లు పైనే అయ్యింది. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు. అదే తపన, అదే నటన, డ్యాన్స్ లో కూడా అదే గ్రేస్ ను మెయింటేన్ చేస్తున్నారు చిరు. రీసెంట్ గా రిలీజ్ అయిన మన శంకర వరప్రసాదు గారు సినిమా కోసం చిరంజీవి వేసిన స్టెప్పులు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. యంగ్ హీరోలను మించిన ఫిట్ నెస్ తో.. స్లిమ్ లుక్ లో అభిమానులను అలరించాడు చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా బ్లాస్టింగ్ కలెక్షనస్ తో దూసుకుపోతోంది.
55
మెగాస్టార్ సినిమాల అప్ డేట్..
చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసంక్రాంతికి మన శంకరవర ప్రసాద్ గారు ఇచ్చిన విజయోత్సాహంతో.. చిరంజీవి మరింత జోరు పెంచారు. ఈ సమ్మర్ లో విశ్వంభర సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్న చిరు.. ఆతరువాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ప్లాన్ చేశారు. ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని కథలను ఆయన వింటున్నట్టు తెలుస్తోంది. రెండు మూడు సినిమాలను పెండింగ్ లో పెట్టాడు మెగాస్టార్. వెంకీ కుడుముల, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో సినిమాలపై క్లారిటీ రావాల్సి ఉంది.