
మెగాస్టార్ చిరంజీవి వివాద రహితుడు, ఇండస్ట్రీలో భారీ వివాదాలేమి లేవు చిరంజీవికి. సినిమాలు చేసుకుంటూ.. ఒక్కొ స్టెప్ ఎక్కుతూ మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. టాలీవుడ్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరించారు చిరంజీవి. ఇక ఇన్నాళ్ళు ఏమో కానీ. ఈమధ్య ఎక్కువగా వివాదాస్పదం అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ కు వెళ్తున్న చిరు.. అక్కడ నోరు జారి ట్రోలింగ్ మెటీరియల్ గా మారుతున్నాడు.
Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?
వారసుడు కావాలని వివాదాస్పదం అయిన చిరంజీవి:
రీసెంట్ గా బ్రహ్మా ఆనందం సినిమా ఈవెంట్ లో చిరంజీవి మాటలు జాతీయ స్థాయిలో అగ్గిరాజేశాయి. చిరంజీవి ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకుని కూర్చున్న ట్రోలర్స్ కు పక్కాగా చేతికి చిక్కాడు చిరంజీవి.
తనకు వారసుడు కావాలి అన్నాడు పర్వాలేదు. కాని ఇంట్లో అందరూ ఆడపిల్లలే అయ్యారు.లేడీ హాస్టల్ లో వార్డెన్ లా ఉంటున్నా అని అనడం, ఈసారి అయినా వారసుడిని ఇవ్వు రామ్ చరణ్ అని పబ్లిక్ గా రిక్వెస్ట్ చేయడం, ఆడపిల్లనే కంటాడేమో అని భయంగా ఉంది అంటూ మాట్లాడటం వివాదానికి దారి తీసింది.
ఎప్పుడో ఫెబ్ ఫస్ట్ వీక్ లో ఆయన మాట్లాడిన మాటలు.. ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా చిరంజీవిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?
చిరంజీవి కి ఏమైంది, వరుస వివాదాలకు కారణం ఏంటి?
ఈమధ్య ఎక్కువగా వివాదాస్పదం అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఈవెంట్లో లో నోరు జారి విమర్శకులకు దొరికిపోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్న మెగాస్టార్ పై బయట రకరకాల రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి.
దాదాపు 45 ఏళ్ళకు పైగా సినిమా కెరీర్, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, సమాజసేవకుడిగా ఇలా పలురకాలుగా చిరంజీవి సేవలు చేశారు.స్టార్ గా ఎదిగారు.
అటువంటి హీరో సినిమా ఈవెంట్లకు వెళ్ళి ఎక్కువగా నోరుజారి వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈమద్య మరో సినిమా ఈవెంట్ లో జై జనసేన అనడంతో వైసీపీ విమర్శలు స్టార్ట్ చేసింది.
రాజకీయాల నాకు సెట్ అవ్వవు అంటూనే నా వారసుడిగా పవన్ రంగంలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్ లో ఉంటూ జై జనసేన ఎలా అంటారంటూ మరికొందరు విమర్శించారు. అంతే కాదు చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారంటూ గట్టిగా ప్రచారం జరిగింది.
ఆయనకు రాజ్య సభ సభ్యత్యంతో పాటు.. కీలక పదవి రెడీగా ఉందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కాని ఓ సందర్భంలో అవన్నీ రూమర్స్ అంటూ చిరు కొట్టిపడేశారు రాజకీయాల్లోకి రావడం ఇక అసంభవం అని చెప్పేశారు.
ఇవే కాదు గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ లో తెలియకుండానే చిరు నోరు జారడం జరిగింది. కొన్నేళ్ల క్రితం యంగ్ హీరో నిఖిల్ సినిమా ఈవెంట్ కు ముఖ్యఅతిదిగా వచ్చిన మెగాస్టార్.. తెలియకుండానే నోరు జారి ఆచార్య సినిమా టైటిల్ ను చెప్పేశాడు.
ఆ తరువాత నాలుక కరుచుకుని, టైటిల్ చెప్పలేదా, రిలీజ్ అవ్వలేదా టైటిల్ అంటూ కవరింగ్ ఇచ్చారు. దాంతో ఆచార్య సినిమా టీమ్ తలపట్టుకోవల్సి వచ్చింది. అప్పుడు తన సినిమా టైటిల్ తో పోయింది. కాని ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చిరు మాట్లాడటం చర్చనీయాంశం అవుతుంది.
మా తాత రసికుడంటూ బుక్ అయిన మెగాస్టార్ :
అదే బ్రహ్మానందం ఈవెంట్ లో చిరంజీవి చేసిన మరో కామెంట్ కూడా ఆయన్ను విమర్శల పాలు చేసింది. మా తాత మంచి రసికుడు, ఆయన ఇద్దరిని మెయింటేన్ చేసేవాడు. అఫీషియల్ గా ఇద్దరు ఉండేవారు. అనధికారికంగా మరొకరు ఉండేవారు. నాకు మా తాత పోలిక రాకూడదంటూ మా అమ్మ కోరుకునేది అంటూ చిరంజీవి మాటలు మరోవివాదంగా మారాయి.
ఈ విషయంలో కూడా ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి ఈవెంట్ లో ఇలానేనా మాట్లాడేది అంటూ చిరంజీవిపై కొందరు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా ఈ మధ్య మెగాస్టార్ కు ఏమయ్యిందో తెలియదు కాని, నోరు జారి బుక్ అవుతున్నారు.
జాతీయ స్థాయిలో చిరంజీవిపై విమర్శలు
చిరంజీవి వ్యాఖ్యలు ఆయన్ను వదిలిపెట్టడంలేదు. ఇన్ని రోజులు అవుతున్నా విమర్శలు ఆగడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు జాతీయ స్థాయిలో కూడా చిరంజీవిపై విమర్శలు ఆగడంలేదు. తాజాగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి చిరంజీవి వ్యాఖ్యలపై మండి పడ్డారు. ఆయనకు కౌంటర్ కూడా ఇచ్చారు.
ఆడపిల్లలను మంచిగా పెంచండి..వారేమీకు వారసులవుతారు అన్నారు. అంతే కాదు మంచిగా పెంచుతున్న తల్లీ తండ్రులను చూసి నేర్చుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కిరణ్ బేడి. అటు సోషల్ మీడియాలో కూడా జాతీయ స్థాయిలో ఆయనపై ట్రోలింగ్ జరుగుతుంది.
ఇటు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కూడా చిరంజీవిని టార్గెట్ చేసి, పవన్ కు లింక్ చేసి మరీ విమర్శిస్తున్నారు. దాంతో మెగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.