సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

Published : Mar 04, 2025, 08:01 AM IST

మేకప్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించదు సాయి పల్లవి. ప్రతీ సినిమాలో ఆమె నేచురల్ గానే కనిపిస్తుంది. తప్పదు అనుకుంటేనే కాస్త లైట్ గా మేకప్ వేస్తుంది. అయితే  సాయి పల్లవి రెగ్యులర్ గా వాడే రెండు మేకప్ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసా?   

PREV
16
సాయి పల్లవి వాడే  రెండే రెండు  మేకప్ ప్రొడక్ట్స్  ఏంటో తెలుసా?
Sai Pallavi Thandel song video promo out

సాయి పల్లవి నేచురల్ బ్యూటీ. కథ నచ్చితేనే సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా ఆమె టైమ్ అద్భుతంగా నడుస్తోంది. రెండు సినిమాలు చేస్తే.. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.  

Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?
 

26
Sai Pallavis Thandel film collection report out

శివకార్తికేయన్ జోడిగా చేసిన అమరన్ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. అంతే కాదు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా సాధించింది ఈ రియల్ లైప్ స్టోరీ. ఇక తెలుగులో నాగచైతన్య జోడీగా నటించిన తండేల్ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది సినిమా. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి.. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

36
Sai Pallavi

అందరు హీరోయిన్లలా కాదు సాయిపల్లవి. సినిమాల విషయంలో కాని.. ఆ సినిమాలలోని పాత్రల విషయంలో కాని నిక్కచ్చిగా ఉంటుంది. అంతే కాదు ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే మరీ స్ట్రిక్ట్ గా ఉటుంది.  

ముఖానికి పెయింట్, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని, పొట్టి డ్రస్సులు  వేసుకోవడం ఆమెకు అలవాటు లేదు. చాలాసింపుల్ గా నేచురల్ గా ఉండటం సాయి పల్లవికి అలవాటు.  అవసరం లేకున్నా రంగులు  పులుముకోవడం ఆమెకు అలవాటు లేదు. 
 

46
Sai pallavi, amaran, Dulquer Salmaan

సాయి పల్లవి తన మేకప్ గురించి చాలా సార్లు మాట్లాడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో  తన  మేకప్ గురించి వివరాలు వెల్లడించింది. ఆ వీడియోలో, సాయి పల్లవి మేకప్ రూపంలో తను ఉపయోగించే వాటి గురించి వివరించింది. ఇంతకీ ఆమె ఏంవాడుతుందో తెలుసా?  

సాయి పల్లవికి మేకప్ కోసం ఈ రెండు వస్తువులు మాత్రంమే ఎక్కువగా వాడుతుందట. సాయి పల్లవి తన ముఖానికి ప్రత్యేకంగా క్రీములు ఏమీ  పూయదు. కాని ఆమె బ్యాగ్ లో మాత్రం ఒక  ఐలైనర్,  మాయిశ్చరైజర్ క్రీమ్. ఈ రెండు తప్పకుండా బ్యాగ్ లో క్యారీ చేస్తుందట. 

56
Sai Pallavi

అయితే హెయిర్ కు సంబంధించి సాయి పల్లవి ఎప్పటికప్పుడు డిజైన్ లు మార్చుకుంటూ ఉంటుందట. సినిమా పాత్రను బట్టి సాయి  పల్లవి తన హెయిర్ స్టైల్  మార్చుకుంటుంది.

కాని ఎక్కువగా ఆమె హెయిర్ స్టైట్ కర్లీగానే ఉండటం మనం చూస్తుంటాం.  సాయి పల్లవి రాత్రిపూట షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఐలైనర్ ఉపయోగిస్తుంది. కళ్ళు బాగా కనిపించడంతో పాటు.. ఆకర్శనీయంగా ఉండటానికి ఇలా ఐలైనర్ వాడుతుందట. 

66

గార్గి, విరాటపర్వం సినిమాల్లో సాయి పల్లవి ఎలాంటి మేకప్ వేసుకోలేదు. మొహం కడుక్కుని తుడుచుకుని  షూటింగ్‌కి వచ్చానని సాయి పల్లవి సరదాగా వ్యాక్యానించింది. సినిమా మొత్తంలో సాయి పల్లవి తన మేకప్ కోసం కేవలం ఐలైనర్ మాత్రమే ఉపయోగించిందట.

ఇక తాను చేసే  డిఫరెంట్ క్యారెక్టర్లకు తగ్గట్టుగా..  హెయిర్‌స్టైల్‌ను తానే  మార్చుకుంటుందట.  మేకప్ వేసుకోవడం కంటే కూడా.. పాత్రకు తగ్గట్టుగా నటించడం ముఖ్యమని ఆమె నమ్ముతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories