ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలతో మాధవన్ అలా ఛాటింగ్ చేశాడా?

Published : Mar 04, 2025, 08:20 AM ISTUpdated : Mar 04, 2025, 08:35 AM IST

Madhavan: మాధవన్ Instagramలో పర్సనల్ గా  అమ్మాయిలతో చాట్ చేస్తున్నాడనే రూమర్స్  పై స్పందించారు. ఒక అభిమాని పంపిన మెసేజ్‌కు ప్రతిస్పందించినందుకు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వివరించారు.

PREV
13
 ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలతో మాధవన్ అలా ఛాటింగ్ చేశాడా?
R Madhavan addresses rumours about chatting with young girls on Instagram in telugu


Madhavan:  ఓ టైమ్ లో యూత్ కి స్పెషల్ ఎట్రాక్షన్  నటుడు మాధవన్ (Madhavan). అయితే ఆయన తన వయస్సు రీత్యా క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ, కీలకమైన పాత్రల్లోనూ కనపడుతున్నారు. ఆయన చాలా జెంటిల్మెన్ గా ఉంటారు.

కానీ ఆయన  అమ్మాయిలను ఆకర్షించేలా ఇనిస్ట్రాలో  మెసేజ్‌లు చేస్తుంటారని, ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడిలో మాధవన్ ని ఈ విషయమై జనం తిట్టిపోస్తూ పోస్ట్ లు కూడా పెట్టిన వాళ్లు ఉన్నారు. అయితే అందుకు కారణం ఏమిటి..అసలు ఏమి జరిగింది అనే విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.  

23
R Madhavan addresses rumours about chatting with young girls on Instagram in telugu


మాధవన్ మాట్లాడుతూ.....‘‘నేను సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తా. అభిమానులకు కూడా త్వరగా రిప్లైలు ఇవ్వను. కొంతకాలం క్రితం ఇన్‌స్టాలో నాకొక అమ్మాయి సందేశం పంపించింది. నేను నటించిన ఓ సినిమా గురించి ఆమె వివరణాత్మకంగా మెసేజ్‌ చేసింది.

‘‘సర్‌ మీరంటే నాకెంతో ఇష్టం. మీరు నటించిన ఆ సినిమా చూశాను. ఇది నాకెంతో ఇచ్చింది. మీరు అద్భుతమైన నటుడు అందులో సందేహం లేదు. ఇందులో మీ నటన చాలా బాగుంది. మీరు నాలో ఎంతో స్ఫూర్తి నింపారు’’ అని పేర్కొంటూ ముద్దులు, హార్ట్‌ ఎమోజీలు జత చేసింది. 

33
R Madhavan addresses rumours about chatting with young girls on Instagram in telugu


‘నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా? వద్దా? అని ఆలోచనలో పడ్డాను. నేను సాధారణంగా ఎవరు మెసేజ్ చేసినా సాధారణంగా థాంక్యూ సో మచ్‌, గాడ్‌ బ్లెస్‌ యు.. ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. ఆ అమ్మాయికి అదే రిప్లై ఇచ్చాను. కానీ వెంటనే ఆమె దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్‌, కిస్‌, లవ్‌ ఎమోజీలను మాత్రమే చూస్తున్నారు.

నేను వాటికే రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు.. కేవలం తన మెసేజ్‌కు మాత్రమే రియాక్ట్ అయ్యాను. మీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్‌ చేస్తాడా? అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సామాజిక మాధ్యమాల్లో ఏదైనా చిన్న కామెంట్‌ పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాను. మరి నా పరిస్థితే ఇలా ఉంటే అనుభవం లేనివారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించగలరా? అని అడుగుతున్నాడు మ్యాడీ.
 

Read more Photos on
click me!

Recommended Stories