ముగ్గరు అక్క చెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

First Published | Dec 28, 2024, 5:11 PM IST

ఆహీరోయిన్లు ముగ్గురు అక్కా చెల్లెళ్లు.. ఆ ముగ్గరు హీరోయిన్లతో సినిమాలు చేసిన రికార్డ్ ఒక్క తెలుగు హీరోకు మాత్రమే దక్కింది. ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..? 

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు.. చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. హీరోయిన్లు గా ఫెయిడ్ అవుట్ అయిన వారు ఉన్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ను కంటీన్యూ చేస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే హీరోయిన్లలో ముగ్గరు అక్కచెల్లెల్లను మీరు ఎప్పుడైనా గమనించారా..? మన తెలుగు ఇండస్ట్రీలోనే హీరోయిన్లు గా కొనసాగిన ఆముగ్గురు అక్కా చెల్లెల్లు ఎవరనుకుంటున్నారు. సీనియర్ తార నగ్మ ఆమె ఇద్దరు చెల్లెళ్లు. 

Also Read: రోజుకు 1 కోటి వసూలు చేసే హీరోయిన్
 

అవును సీనియర్ హీరోయిన్ నగ్మ గురించి తెలిసిందే.. హీరోయిన్ గా కెరీర్ క్లోజ్ అయిన తరువాత ఆమె సినిమాలు చేయలేదు. పొలిటికల్ కెరీర్ వైపు దృష్టిపెట్టింది. సినిమాల ఊసు లేకుండా.. పెళ్లి కూడా చేసుకోకుండా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక నగ్మ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చింది జ్యోతిక. ఈ హీరోయిన్ కూడా స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ స్టార్స్ తో కలిసి నటించి జ్యోతిక.. సూర్యను ప్రేమించి పెళ్ళాడి.. హీరోయిన్ గా తన కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టింది. 

Also Read: అల్లు అర్జున్ ‌- రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ మూవీ..?


ఇక ప్రస్తుతం నిర్మాతగా మారింది. అంతే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలుచేసుకుంటుంది. ఇక వీళ్లదరే అందరికి తెలిసింది. కాని వీరికి ఇంకో చెల్లెలు ఉంది... ఆమె పేరు రోషిణి. ఈమె కుడా తెలుగు,తమిళ భాషల్లో పదిలోపు సినిమాలు చేసింది. ఆతరువాత పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యింది. సినిమాలు మానేసింది. ఇక ఈమూగ్గురు హీరోయిన్లు అక్కా చెల్లెళ్లు అని తెలిసినవారు చాలా తక్కువమంది ఉన్నారు. 

Also Read: విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

నగ్మ చెల్లెలుజ్యోతికా అని కొంత మందికి తెలిసు కాని.. వీరంతా సొంత అక్కా చెల్లెల్లు కాదు. ఇక ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు  ఒక హీరోతో నటించారని తెలుసా..? అది కూడా తెలుగు స్టార్ హీరో తో విడి విడిగా ఈ ముగ్గురు సినిమాలు చేశారని తెలుసా..? ఇంతకా ఆ హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. 

అవును చింజీవితో ఈ ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ముందుగా నగ్మ సంగతి చూస్తే.. చిరంజీవితో చాలా సినిమాలు చేసింది. అప్పట్లో చిరు- నగ్మ ఇండస్ట్రీ హిట్ పెయిర్‌గా నిలిచారు. వీరు నటించిన  రిక్షావోడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు బ్లాక్ బాస్టర్ హిట్స్‌గా నిలిచాయి. నగ్మ అప్పటి యూత్ కు కలల దేవతగా ఉండేది. 
 

ఇక నగ్మ తరువాత ఇండస్ట్రీకి వచ్చిన జ్యోతిక కూడా తెలుగులో అందరు స్టార్లతో నటించింది. అయితే ఆమె చిరంజీవితో మాత్రం ఠాగూర్ సినిమాలో నటించింది. ఈసినిమాలో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెగాస్టార్ భార్యగా.. నటించిందిజ్యోతిక. ఈ సినిమాలో జ్యోతిక పాత్ర సగంలోనే మరణిస్తుంది. 

ఇక చాలామందికి తెలియని హీరోయిన్ రోషిణి. ఈమె కూడా చిరంజీవితో ఒక సినిమాలో నటించిందని మీకు తెలుసా..? ఇంతకీ ఆ సనిమా ఏంటంటే.. మాస్టారు. 1997 లో మాస్టర్ సినిమాతో రోషిణి కూడా చిరు పక్కన నటించింది. ఠాగూర్ సినిమాలో జ్యోతిక మల్లే.. మాస్టారు సినిమాలో రోషిణి కూడా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తుంది. ఈసినిమాలో రోషిణి  పాత్ర కూడా చనిపోతుంది. ఇలా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో నటించిన ఏకైక హీరోగా చిరు గుర్తింపు పొందాడు. అయితే ఈ ముగ్గురితో నటించిన అన్ని సినిమాలు హిట్ కావడం మరో విశేషం.

Latest Videos

click me!